ఆధునిక రాధాకృష్ణులు : మేనత్తతో అల్లుడి ప్రేమాయణం... గర్భం దాల్చడంతో ఇంట్లోనుంచి పారిపోయి...

Published : Aug 30, 2021, 11:50 AM IST
ఆధునిక రాధాకృష్ణులు : మేనత్తతో అల్లుడి ప్రేమాయణం... గర్భం దాల్చడంతో ఇంట్లోనుంచి పారిపోయి...

సారాంశం

మధ్యప్రదేశ్ లోని  సిహావల్ మండలంలో ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా అన్ని ఇష్టపడింది. వారి మధ్య ప్రేమాయణం ఓ ఏడాది కాలం నడిచింది. ఈ క్రమంలోనే అత్త గర్భం దాల్చింది. ఆమెకు ఆరో నెల వచ్చేసరికి... వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది.  

మధ్యప్రదేశ్ : క్రిష్ణాష్టమి రోజూ.. రాధాకృష్ణుల్లాంటి ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. తనకన్నా పెద్దదైన మేనత్త రాధను ప్రేమించిన కృష్ణుడు.. ఆమె మోహంలో పడిపోతాడు. వారిద్దరి ప్రేమను ప్రపంచంలోనే అపురూపమైన ప్రేమబంధంగా అభివర్ణిస్తారు. కానీ అలాంటి ప్రేమ నిజజీవితంలో జరిగితే పెద్దలు ఒప్పుకోరు. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. చివరికి ఆ జంటను అసువులు బాసేలా చేసింది. 

మధ్యప్రదేశ్ లోని  సిహావల్ మండలంలో ఓ యువకుడు తనకన్నా పెద్దదైన మేనత్తను ప్రేమించాడు. ఆమె కూడా అన్ని ఇష్టపడింది. వారి మధ్య ప్రేమాయణం ఓ ఏడాది కాలం నడిచింది. ఈ క్రమంలోనే అత్త గర్భం దాల్చింది. ఆమెకు ఆరో నెల వచ్చేసరికి... వారి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలిసింది.  

అయితే వెనక్కి తగ్గలేదు.. కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, వారు ససేమిరా అన్నారు. దీంతో చేసేదేమీ లేక ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి వంతెనపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

మేనత్త, అల్లుడు ఒకే గ్రామానికి చెందిన వారు. ఆమె ఆరు నెలల గర్భవతి.. అని తెలిసిన వెంటనే.. అల్లుడు అత్త ఇంటికి చేరుకుని పెళ్లి విషయాన్ని అక్కడివారికి చెప్పాడు. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు అతనికి వద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అతను వినలేదు. దీంతో ఇద్దరూ కలిసి శుక్రవారం రాత్రి ఇంట్లో నుంచి పారిపోయారు. 

సమీపంలో ఉన్న సోన్ నది వంతెన పైనుంచి దూకారు. అటుగా వెళ్తున్న వారు నది ఇసుకతిన్నెలపై పడి ఉన్న జంటను చూసి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారిని అమేలియాలోని ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu