దొంగతనం చేశాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్స్ లో తన్ని..!

Published : Aug 30, 2021, 11:12 AM IST
దొంగతనం చేశాడనే అనుమానంతో.. ప్రైవేట్ పార్ట్స్ లో తన్ని..!

సారాంశం

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తి పట్ల దారుణంగా ప్రవర్తించారు. రెండు రోజుల క్రితం.. దొంగనతం ఆరోపణలతో ఓ గిరిజన యువకుడిని ట్రక్కుకు కట్టేసి.. దారుణంగా కొట్టారు. ఈ సంఘటన మరవకముందే.. మరో వ్యక్తిపై కూడా ఇలాంటి దాడే జరగడం గమనార్హం.

బస్సులో బ్యాటరీలు చోరీ చేశాడని ఆరోపిస్తూ.. ఓ యువకుడిని దారుణంగా కొట్టారు. అతని ప్రైవేట్ పార్ట్స్ లో సైతం  కాలితో తన్నడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాధితుడు అసద్ అనే వ్యక్తిగా గుర్తించారు.

కాగా.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో... పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు గుర్తించారు. కాగా.. నిందితులు డానిష్, కుల్దీప్ లను ఇఫ్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

 

కాగా.. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలవరపరిచింది. ఈ హింసాత్మక ఘటనపై పోలీసులు సైతం సీరియస్ అయ్యారు.  ఇదిలా ఉండగా.. సరిగ్గా రెండు రోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

దొంగతనం ఆరోపణలతో ఓ వ్యక్తిని ట్రక్కుకు కట్టేసి మరీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో తర్వత చనిపోయాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది నిందితులను గుర్తించగా.. వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు.  ఈ ఘటన మరవకముందే.. మరో ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?