పాపులారిటీ కోసం, పన్నెండేళ్ల కొడుకుతో తల్లి అశ్లీలనృత్యాలు.. సోషల్ మీడియాలో పోస్టింగ్ !!

Published : Jul 20, 2021, 11:15 AM IST
పాపులారిటీ కోసం, పన్నెండేళ్ల కొడుకుతో తల్లి అశ్లీలనృత్యాలు.. సోషల్ మీడియాలో పోస్టింగ్ !!

సారాంశం

కన్నకొడుకుతో ఆమె చేయించిన ఆ పని ప్రస్తుతం పెద్ద దుమారంగా మారింది. ఆమె మీద కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీలోని మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. 

ఢిల్లీ : నేటికాలంలో పాపులారిటీ రావడం చాలా ఈజీ, పిచ్చిగంతులు, పచ్చిబూతులు.. ఇష్టం వచ్చినట్లు నోరుపారేసుకుంటే.. ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. దీనికోసం మరీ దిగజారుతున్నారు. అలాగే దిగజారింది ఢిల్లీకి చెందిన ఓ తల్లి...

కన్నకొడుకుతో ఆమె చేయించిన ఆ పని ప్రస్తుతం పెద్ద దుమారంగా మారింది. ఆమె మీద కేసు నమోదు చేయాలంటూ ఢిల్లీలోని మహిళా సంఘం డిమాండ్ చేస్తోంది. ఆ మహిళ చేసిన దారుణమేంటంటే....

12యేళ్ల కొడుకుతో కలిసి అసభ్యకరమైన నృత్యాలు, యాక్షన్ చేస్తూ వీడియోలు చేసింది. వీటిని ఇన్ స్ట్రా లో పోస్ట్ చేసి పాపులారిటీ కోసం ప్రయత్నించింది. ఇన్ స్టా లో ఆమె అకౌంట్ కు 1.6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉండడం గమనార్షం. అయితే.. ఈ తల్లి చేస్తున్న వీడియోలు ఎలాగో ఢిల్లీ మహిళా ఆయోగ్ (ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్) కంటపడ్డాయి. వాటిని చూసిన వారు మండిపడ్డారు. 

ఇలాంటి నృత్యాలు, నటనలతో పిల్లాడికి ఆ తల్లి ఏం నేర్పిస్తుందంటూ ధ్వజమెత్తింది. ఆమె మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసులకు ఒక లేఖ రాసింది. దీంతోపాటు ఆ తల్లి ఇన్ స్టా అకౌంట్ లో ఉన్న వీడియోల్లో కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసింది మహిళా ఆయోగ్. ఆమె మీద వెంటనే కేసు పెట్టాలని డిమాండ్ చేసింది. 

10-12యేళ్ల వయసులో ఆ పిల్లాడికి ఇలాంటివి నేర్పడం వల్ల భవిష్యత్తులో అతను ఎలా మారతాడని ఈ కమిషన్ తన లేఖలో ప్రశ్నించింది. చిన్నతనంలోనే ఆడవారిని వస్తువులుగా చూడటం నేర్పిస్తే, భవిష్యత్తులో అతను మరిన్ని అపరాధాలు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

తల్లీబిడ్డల పవిత్ర బంధాన్ని ఆ తల్లి అవమానించేలా ప్రవర్తించిందని మండిపడిన మహిళా ఆయోగ్. ఆమె మీద వెంటనే కేసు పెట్టి, ఆ పిల్లాడికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరింది. ఆ పిల్లాడికి మంచి, చెడుల గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?