ఇండియాలో కరోనా తగ్గుముఖం: 97 శాతానికి పెరిగిన రికవరీ

Published : Jul 20, 2021, 10:27 AM ISTUpdated : Jul 20, 2021, 10:28 AM IST
ఇండియాలో కరోనా తగ్గుముఖం:  97 శాతానికి పెరిగిన రికవరీ

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రికవరీ కేసులు 97.32 శాతానికి పెరిగాయి. యాక్టివ్ కేసులు దేశంలో 4 లక్షలకు చేరాయి గత 24 గంటల్లో 30,093 కరోనా కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 30 వేలుగా నమోదయ్యాయి. నాలుగు నెలల క్రితం కనిష్టానికి కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 374 మంది మరణించారు. గత 24 గంటల్లో 30,093 మంది కరోనా కేసులు  నమోదయ్యాయి.దేశంలో ఇప్పటివరకు 3,11,74,322 కరోనా కేసులు నమోదయ్యాయని  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్క రోజే కరోనా నుండి 45 వేల మంది కరోనా నుండి కోలుకొన్నారు. ఇప్పటివరకు దేశంలో 3,03,53,710 మంది రికవరీ అయినట్టుగా కేంద్రం తెలిపింది.

ఇప్పటివరకు కరోనాతో  4,14,482 మంది మరణించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ఇంకా 4,06,130 యాక్టివ్ కేసులున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 1.35 శాతానికి తగ్గాయి.  కరోనా రోగుల రికవరీ రేటు 97.32 శాతంగా నమోదైంది.దేశంలో ఇప్పటివరకు 41 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ అందించారు. నిన్న ఒక్కరోజే 52,67,309 మందికి వ్యాక్సినేషన్ చేశారు. కరోనాను కట్టడి  చేసేందుకు  కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది.


 

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?