దారుణం : ఐదు రోజుల చిన్నారి వేళ్లను మరుగుతున్న నూనెలో పెట్టిన తల్లి..

Published : Jun 17, 2023, 07:04 AM IST
దారుణం : ఐదు రోజుల చిన్నారి వేళ్లను మరుగుతున్న నూనెలో పెట్టిన తల్లి..

సారాంశం

మూఢనమ్మకాలతో దారుణానికి ఒడిగట్టింది..ఓ తల్లి. తన 5రోజుల చిన్నారి పాలు తాగడం లేదని వేళ్లను వేడి నూనెలో పెట్టింది. 

బారాబంకి: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి తన ఐదు రోజుల నవజాత శిశువు వేళ్లను నూనెలో ముంచింది. ఈ దారుణ ఘటన ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోనే జరగడం గమనించాల్సిన విషయం. మూఢనమ్మకాలతో.. దయ్యాలవల్లే అలా జరుగుతుందని ఈ ఘాతుకానికి ఒడి గట్టినట్టు సమాచారం.

వివరాలలోకి వెడితే.. ఫతేపూర్ కొత్వాలి ప్రాంతంలోని ఇస్రౌలీ గ్రామానికి చెందిన అషియా ఐదు రోజుల క్రితం ఒక బిడ్డకు జన్మనిచ్చింది. 3,4 రోజులు బాగానే ఉన్న  పుట్టిన బిడ్డ.. ఆ తరువాత పాలు తాగడం లేదు. దీంతో తల్లి ఆషియా తీవ్ర ఆందోళనకు గురయ్యింది. గురువారం ఆ తల్లి తన 5రోజుల శిశువు కుడిచేతి వేళ్లను కాగుతున్న నూనెలో పెట్టింది. 

వదినతో మరిది రాసలీలలు.. భర్తకు తెలియడంతో.. ఎంతటి దారుణానికి పాల్పడ్డారంటే..?

నవజాతశిశువు చేయి కాలడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆ చిన్నారిని తండ్రి ఇర్ఫాన్ ఫతేపూర్ సీహెచ్‌సీలో చేర్పించారు. దెయ్యాల వల్లే ఇలా జరిగిందని ఆ తల్లి నమ్మింది. మూఢనమ్మకాలతో చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చింది. దీనిమీద వైద్యులు మాట్లాడుతూ ఇలాంటి సందర్భాల్లో వైద్యం అందకపోవడానికి సమాజంలో అవగాహన లోపమే కారణమని జిల్లా ఆసుపత్రి మానసిక వైద్యుడు చెబుతున్నారు.

దెయ్యంగా పొరబడడానికి ఓ కారణం ఉందట... అంతకు ముందు వారికి పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోయారని తల్లి ఆషియా తెలిపింది. ఈ చిన్నారినైనా కాపాడుకోవాలని ఇంత ప్రమాదకరమైన పని చేయాల్సి వచ్చిందట. పుట్టినప్పటి నుంచి బిడ్డ పాలు తాగడం లేదని, ఏడవడం లేదని ఆషియా చెప్పింది. దీంతో ఈ పిల్లాడికి ఏమైనా అయిపోతుందేమోనని భయపడింది. దెయ్యాన్ని వదలగొట్టడానికి ిదే మార్గం అని నమ్మి.. వేడి వేడి నూనెలో పిల్లాడి వేళ్లను పెట్టింది.

మూఢనమ్మకాలతో కాగుతున్న నూనెలో వేలు పెట్టించిన తరువాతే.. చిన్నారి పాలు తాగడం ప్రారంభించిందని కాకపోతే ఇప్పుడు విరేచనాలు కూడా మొదలయ్యాయని తల్లి చెప్పింది. ప్రస్తుతం పిల్లవాడు బాగానే ఉన్నాడు కానీ జ్వరం తగ్గడం లేదు.

పిల్లల్లో వాంతులు-విరేచనాలు, చేతులు, కాళ్లు మొద్దుబారడం, పాలు తాగకపోవడం, పిల్లల్లో ఎలాంటి స్పందన లేకపోవడం, శరీరం రంగు మారకపోవడం లాంటివి.. వివిధ వ్యాధుల లక్షణాలని జిల్లా ఆస్పత్రిలో మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఆర్తి యాదవ్‌ తెలిపారు. సైకలాజికల్ ‘జామోగా’ పట్టిందని కొందరు నమ్ముతారని.. దాన్ని వదిలించుకోవడానికి, వేడి నూనెలో వేళ్లు పెట్టడం లేదా భూతవైద్యం వంటి మూఢనమ్మకాలను ఆశ్రయిస్తారన్నారు. దీని కోసం విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, నిపుణులైన వైద్యుల సహాయంతో ఈ తీవ్రమైన సమస్యను అధిగమించవచ్చని డాక్టర్ చెప్పారు

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం