
కామంతో కళ్లుమూసుకుపోతున్న కొందరు వావివరుసలు మరిచి కామాంధుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆడా, మగా కామంతో రెచ్చిపోతున్నారు. ఎవరేమైనా కానీ తమ శారీరక వాంఛలు తీరితే చాలు అనుకున్న ఓ యువకుడు తనవదినపై కన్నేశాడు. ఆమెకు మయ మాటలు చెప్పి.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. తండ్రి లాంటి అన్న కళ్లుగప్పి ద్రోహం చేశాడు. సమయం దొరికినప్పుడల్లా వదినతో కామవాంఛ తీర్చుకున్నాడు. వదిన కూడా మరిది మోజులో పడి భర్తను పట్టించుకోవడం మానేసింది. దీంతో అనుమానం వచ్చినా భర్త.. వారిపై నిఘా పెడితే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కానీ.. అదే అతని ప్రాణాలకు ముప్పుగా మారింది. వారి అక్రమ సంబంధం గురించి తెలిసి భర్త పలుసార్లు మందలించారు.
తమ బంధానికి అడ్డుగా మారాడని భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చింది. భర్త శవాన్ని మరుగుదొడ్డి గుంతలో పూడ్చిపెట్టేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. దుర్వాసన రావడంతో ఇద్దరూ గొయ్యిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి నిర్మాణంలో ఉన్న ఇంట్లో పూడ్చిపెట్టారు. భార్య చేష్టలపై ఇరుగుపొరుగు వారికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హత్య చేసినట్లు ఇద్దరూ అంగీకరించారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన మృతుడి భార్యను, సవతి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పాతిపెట్టిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లా పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలా గ్రామంలో చోటుచేసుకుంది. 36 ఏళ్ల సాగర్ అలీ తన భార్య ఆషియా (34) మరియు ముగ్గురు పిల్లలతో నివసించాడు. సాగర్ అలీ బట్టలు కుట్టడం ద్వారా కుటుంబాన్ని పోషించేవాడు. అతని సవతి సోదరుడు సుహైల్ (25) రూర్కీలో నివసిస్తున్నాడు. ఐదు నెలల క్రితం సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చాడు. సుహైల్ తరచూ సాగర్ అలీ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో సాగర్ అలీ భార్య ఆషియా సాన్నిహిత్యం పెరిగింది. ఆషియా కోరిక మేరకు సుహైల్ కూడా అదే గ్రామంలో 100 గజాల స్థలం కొని అందులో ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాడు.
ఎప్పుడైతే సాగర్ అలీ తన పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లాడో.. అప్పుడే సుహైల్ తన వదిన ఆషియా వద్దకు చేరుకునేవాడు. నెల రోజుల క్రితం.. సాగర్ అలీ అకస్మాత్తుగా అర్థరాత్రి ఇంటికి చేరుకున్నప్పుడు.. సుహైల్, అతని భార్య అభ్యంతరకరమైన స్థితిలో ఉండటం చూశాడు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో సుహైల్ ఇంటికి రాకుండా నిషేధం విధించాడు. ఆ తర్వాత అషియా, సుహైల్‌లు .. అతడి అడ్డు తొలిగించుకోవాలని పథకం వేశారు.
పథకం ప్రకారం.. సుమారు 10 రోజుల క్రితం సాగర్ అలీ ఆహారంలో ఆషియా మత్తు మందు కలిపింది.దీంతో సాగర్ అలీ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత ప్రియుడితో కలిసి ఆమె గొంతు కోసి హత్య చేసింది. మొదట మృతదేహాన్ని దాచేందుకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మరుగుదొడ్డి గుంతలో మృతదేహాన్ని దాచారు. మరుసటి రోజు.. ఏమి తెలియనట్టు.. పుర్కాజీ పోలీస్ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదని ఆషియా ఫిర్యాదు చేసింది. రెండు రోజుల తర్వాత టాయిలెట్ పిట్ నుంచి దుర్వాసన రావడంతో ఆషియా టాయిలెట్ పిట్ దగ్గర అగరబత్తీ పెట్టడం ప్రారంభించింది. ఇంట్లో కూడా అగరబత్తీలు పెడటం.. పూజలు చేయడం ప్రారంభించింది.
ఆషియా ఇలా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారికి ఆమెపై అనుమానం పెరిగింది. అలాగే.. టాయిలెట్ పిట్‌ను దుర్వాసన రావడంతో దానిని శుభ్రం చేయించమని పోరుగువారు కోరారు. దీంతో ఆషియా తన ప్రేమికుడు సుహైల్‌తో కలిసి తన భర్త మృతదేహాన్ని మరుగుదొడ్డి గొయ్యిలోంచి తీసి నిర్మాణంలో ఉన్న సుహైల్ ఇంట్లో పాతిపెట్టింది. అర్ధరాత్రి ఆషియా, సుహైల్‌లు ఇంట్లోకి మట్టిని పోస్తుండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టి మరోసారి ఇంటికి వెళ్లిపోయారు.
బయటపడ్డ బండారం
ఇంతలో సాగర్ అలీ బంధువులకు ఆషియా, ఆమె ప్రేమికుడిని అభ్యంతరకర స్థితిలో పట్టుకున్నారు. ఆ తర్వాత అందరూ అతన్ని దారుణంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సాగర్ అలీ హత్య నేరాన్ని వారు అంగీకరించాడు. పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి, వారి సూచన మేరకు నిర్మాణంలో ఉన్న ఇంట్లో నుంచి అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. సాగర్ అలీ తండ్రికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు సాగర్ అలీతో పాటు ఇద్దరు కొడుకులు.. రెండో భార్య కొడుకు సుహైల్. ఇతడు రూర్కీ నివాసి, 5 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలో వెల్డింగ్ మెకానిక్‌గా పనిచేశాడు. అతను గత ఆరునెలల క్రితం తిరిగి వచ్చాడు.
పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలా గ్రామంలో సాగర్ అలీ అనే వ్యక్తి తప్పిపోయినట్లు 9వ తేదీన నమోదైందని సీఓ సదర్ యతేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టగా.. మృతుడి భార్య ఆషియా, ఆమె ప్రేమికుడు సుహైల్‌లు అతడిని హత్య చేసి మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న ఇంట్లో పూడ్చిపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.