చిక్కడు.. దొరకడు.. వరుసగా 17 మంది అమ్మాయిలపై అత్యాచారం

By sivanagaprasad kodatiFirst Published Oct 4, 2018, 10:56 AM IST
Highlights

అమ్మాయి కనిపిస్తే చాలు అతనిలోని కామాంధుడు నిద్రలేస్తాడు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది అమ్మాయిలపై ఆత్యాచారానికి పాల్పడిన కరడుగట్టిన సీరియల్ రేపిస్ట్‌ని ముంబై పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. 

అమ్మాయి కనిపిస్తే చాలు అతనిలోని కామాంధుడు నిద్రలేస్తాడు అలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది అమ్మాయిలపై ఆత్యాచారానికి పాల్పడిన కరడుగట్టిన సీరియల్ రేపిస్ట్‌ని ముంబై పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.

ముంబై మహానగరంలోని నాయనగర్ వుడ్‌ల్యాండ్ సొసైటీలో నివాసముంటున్న ఖురేషీ బిల్డర్లకు భవన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇతను నిత్యం నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద తిరుగుతూ.. ఒంటరిగా ఉన్న బాలికలను చూసి.. ‘‘ మీ నాన్న పిలుస్తున్నాడని’’ చెప్పి వారిని జనసంచారం లేని ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడు...

అలా నవీ ముంబై, థానే, థానే రూరల్, పాల్ఘార్ జిల్లాలకు చెందిన సుమారు 17 మంది బాలికలపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతనిని పట్టుకునేందుకు పోలీసులు నిఘా పెట్టడంతో అత్యంత చాకచాక్యంగా వ్యవహరించేవాడు.

సెల్‌ఫోన్ సిమ్‌లు మారుస్తూ.. ఫోన్ స్విచాఫ్ చేస్తూ తన లోకేషన్‌ పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడేవాడు. ఖురేషిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను నియమించారు. ఎట్టకేలకు ఇతను దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు..

ఖురేషి కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుతో పాటు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని నవీముంబై పోలీస్ కమిషనర్ నిర్ణయించారు. ఇతని అరెస్ట్ ఈ నాలుగు జిల్లాల్లో సంచలనం సృష్టించింది. 

click me!