యూపీలో ఎన్ కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మృతి..

Published : Jun 27, 2023, 08:21 AM IST
యూపీలో ఎన్ కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మృతి..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఒకరు మృతి చెందాడు. అతనిమీద ఇప్పటికే రూ. లక్ష రివార్డు ఉంది.   

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక వాంటెడ్ క్రిమినల్‌ హతమయ్యాడు. నేరస్థుడిని గుఫ్రాన్‌గా గుర్తించారు. అతడు అనేక హత్యలు, దోపిడీ కేసులలో వాంటెడ్ గా ఉన్నాడు.

యుపి పోలీసుల కథనం ప్రకారం, మంగళవారం ఉదయం 5:00 గంటలకు, ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందం కౌశాంబి జిల్లాలో సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాల్లో వారికి గుఫ్రాన్‌ను బృందం ఎదుర్కొంది. వారు పోలీసుల మీద కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో గూఫ్రాన్ మరణించాడు. క్రాస్ ఫైరింగ్‌లో గుఫ్రాన్  గాయపడ్డాడు. గుఫ్రాన్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్, ఇతర జిల్లాల్లో హత్య, హత్యాయత్నం, దోపిడీతో సహా 13కి పైగా కేసుల్లో గుఫ్రాన్ వాంటెడ్ గా ఉన్నాడు. గుఫ్రాన్ ను పట్టుకున్నవారికి ఉత్తరప్రదేశ్ పోలీసులు రూ. 1,00,000 బహుమతిని ప్రకటించారు. యూపీ పోలీసులకు, నేరగాళ్లకు మధ్య జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో ఇది తాజాది. 2017లో యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు 10,900 ఎన్‌కౌంటర్‌లు జరిగాయి, అందులో 185 మందికి పైగా నేరస్థులు మరణించారు.

PREV
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?