పుణె వాసులను టోర్నడోలు వణికిస్తున్నాయి. దోమల టోర్నడోలుగా స్థానికులు వీటిని పిలుస్తున్నారు.
ముంబై: అమెరికా దేశంలో టోర్నడోలు తరచుగా సంభవిస్తుంటాయి. టోర్నడోలు పెను ఉత్పతాన్ని సృష్టిస్తాయి. టెక్నాలజీ పరంగా ముందున్న అమెరికా దేశం టోర్నడోలు వస్తే తీవ్రంగా నష్టపోతుంది. అయితే ఇండియాలో కూడ టోర్నడో సంభవించినట్టుగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఈ టోర్నడో దోమల టోర్నడో.
also read:IND vs ENG 3rd Test: కె.ఎల్.రాహుల్ దూరం, భారత జట్టులోకి దేవదత్
మహారాష్ట్రలోని ముంధ్వా, కేశవనగర్ తదితర ప్రాంతాల్లో దోమల టోర్నడోలు తరహాలో ఆకాశంలో దృశ్యాలు కన్పించాయి. కొందరు ఈ దృశ్యాలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారాయి.
Thanks for giving Valentine gift of Mosquitoes Tornado to Keshav Nagar Pune Residents in return to their timely municipality tax payments. pic.twitter.com/iQxSb5tj8Y
— Rakesh Nayak (@Rakesh4Nayak)ములా- ముఠా నదిలో నీటి మట్టం పెరగడం వల్లే దోమలు పెరిగాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దోమల భయంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలను ఇళ్ల నుండి బయటకు పంపడానికి కూడ పేరేంట్స్ ఇష్టపడడం లేదు.
also read:బస్సులో చెప్పులతో కొట్టుకున్న ప్రయాణీకులు: సోషల్ మీడియాలో వీడియో వైరల్
వర్షాకాలంలో దోమల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే వేసవి కాలం సమీపిస్తున్న సమయంలో దోమలు విపరీతంగా పెరగడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. దోమల నివారణకు గాను అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.