మోర్బీ బ్రిడ్జి ప్రమాదం.. బాధితులకు రూ.5 కోట్ల పరిహారం..

Published : Feb 22, 2023, 12:42 AM ISTUpdated : Feb 22, 2023, 01:19 AM IST
మోర్బీ బ్రిడ్జి ప్రమాదం.. బాధితులకు రూ.5 కోట్ల పరిహారం..

సారాంశం

మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనపై గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి బంధువులకు మధ్యంతర నష్టపరిహారం రూ. 5 కోట్లు చెల్లించాలని ప్రతిపాదన చేసింది. సంస్థ నిర్వహించే సస్పెన్షన్ బ్రిడ్జి గత ఏడాది అక్టోబర్‌లో మోర్బీ పట్టణంలో కూలిపోయింది.

దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జి కూలిన ఘటనపై గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మరణించిన లేదా గాయపడిన వారి బంధువులకు ఐదు కోట్ల రూపాయల మధ్యంతర నష్టపరిహారాన్ని వాచ్ మేకర్ ఒరెవా గ్రూప్ అందించాలని గుజరాత్ హైకోర్టు పేర్కొంది. అయితే కంపెనీ ఇచ్చే పరిహారం సమర్థమైనది కాదని హైకోర్టు పేర్కొంది.

మోర్బీ నగరంలోని మచ్చు నదిపై నిర్మించిన బ్రిడ్జి గతేడాది అక్టోబర్ 30న కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 56 మంది గాయపడ్డారు. అజంతా మాన్యుఫ్యాక్చరింగ్ లిమిటెడ్ (ఒరేవా గ్రూప్) గత ఏడాది దుర్ఘటన తర్వాత హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా మధ్యంతర నష్టపరిహారానికి హామీ ఇచ్చింది.

ఒరేవా గ్రూప్ తరపున సీనియర్ న్యాయవాది నిరుపమ్ నానావతి వాదించారు. మృతుల సమీప బంధువులకు సుమారు రూ. 3.5 లక్షలు, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందిస్తామని కోర్టుకు తెలిపారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సోనియా గోకాని, జస్టిస్‌ సందీప్‌ భట్‌లతో కూడిన ధర్మాసనం ఇది న్యాయమైనదేనా? మీరు స్వచ్ఛందంగా నష్టపరిహారం చెల్లించడానికి మీ సుముఖతను వ్యక్తం చేసారు. ఇది న్యాయమని మీరు అనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
  
బెంచ్ బుధవారం తదుపరి విచారణ కోసం.. ఈ విషయాన్ని జాబితా చేసింది. చెల్లింపు 'చివరి'గా వివరించబడనందున భవిష్యత్తులో కంపెనీ మరింత నష్టపరిహారం చెల్లిస్తుందో లేదో తన క్లయింట్ నుండి సూచనలు తీసుకోవాలని నానావతిని కోరింది. ఒరెవా అందించే పరిహారం ఎలాంటి బాధ్యత నుండి విముక్తి కలిగించదని బెంచ్ గతంలో స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రకారం.. ఒరెవా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (MD) జైసుఖ్ పటేల్ వంతెన నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. ఐదు కోట్ల రూపాయల మొత్తం తాత్కాలిక ఉపశమని నానావతి కోర్టుకు తెలియజేశారు. రెండు వారాల్లోగా గుజరాత్ ప్రభుత్వానికి ఒరెవా గ్రూప్ ఐదు కోట్ల రూపాయలను జమ చేస్తుందని తెలిపారు. గాయపడిన లేదా మరణించిన వారి తదుపరి బంధువులకు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్రం నిర్ణయించగలదని నానావతి చెప్పారు.

అంతే కాకుండా ఈ దుర్ఘటనలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఏడుగురు పిల్లలకు కార్పొరేట్ సంస్థ పూర్తి బాధ్యత వహిస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ ఏడుగురు పిల్లలు యుక్తవయస్సు వచ్చే వరకు నివాసం, విద్య వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను పొందుతారు. వారి మెరిట్ ప్రకారం కంపెనీ ఉద్యోగం కూడా ఇస్తుందని సీనియర్ న్యాయవాది చెప్పారు.

మృతుల బంధువులకు రాష్ట్ర, కేంద్రం ఇప్పటి వరకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.రెండు లక్షల చొప్పున పరిహారం ఇచ్చాయని సీనియర్ న్యాయవాది కమల్ త్రివేది కోర్టుకు తెలిపారు.మోర్బీ పోలీసులు ఒరేవా గ్రూప్ ఎండీ జయసుఖ్ పటేల్‌తో సహా పది మంది నిందితులను ఐపిసి సెక్షన్లు 304, 308, 336, 337 కింద అరెస్టు చేశారు.  

PREV
click me!

Recommended Stories

New Year Celebrations in UAE | Dubai Welcomes 2026 | Fire Works | Music Shows | Asianet News Telugu
Bank Holidays 2026: ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ విడుదల.. ఈ తేదీల్లో బ్యాంకులు బంద్!