మోను మనేసర్‌ అరెస్ట్.. హర్యానాలో అదుపులోకి తీసుకున్న పోలీసులు..

మంగళవారం హర్యానాలో గోసంరక్షకుడు మోను మనేసర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు ముస్లింలను హత్య చేసిన నిందితుల్లో ఇతను ఒకడు.

Google News Follow Us

హర్యానా : గోసంరక్షకుడు మోను మనేసర్‌ను హర్యానా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు ముస్లిం వ్యక్తులను హత్య చేసినందుకు మోను మనేసర్ అనే భజరంగ్ దళ్ సభ్యుడిపై ఫిబ్రవరిలో కేసు నమోదు చేశారు.

ఓ మీడియా సంస్థకు దొరికిన సీసీటీవీ వీడియోలో, హర్యానాలో సాధారణ దుస్తులు ధరించిన అధికారులు మోను మనేసర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ మమతా సింగ్  ఆ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. అభ్యంతరకరమైన సోషల్ మీడియా పోస్ట్‌పై మోను మనేసర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఎవరీ మోను మనేసర్ ?హర్యానా మత ఘర్షణలతో అతనికి ఏం సంబంధం?

మోను మనేసర్ కావాలంటున్న ఇతర రాష్ట్రాల్లోని పోలీసు శాఖకు కూడా సమాచారం అందించామని ఏడీజీ తెలిపారు. రాష్ట్ర పోలీసులు మోను మనేసర్‌ను కోర్టు ద్వారా కస్టడీకి తీసుకోవచ్చు అని మమతా సింగ్ తెలిపారు.

మోను మనేసర్ ఎవరు?
మోను మనేసర్ అలియాస్ మోహిత్ యాదవ్ బజరంగ్ దళ్ సభ్యుడు, గోసంరక్షకుడు.  గురుగ్రామ్ సమీపంలోని మనేసర్ నుండి వచ్చాడు. ముస్లిం వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మృతికి సంబంధించి కీలక నిందితుల్లో ఇతను ఒకడు.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని ఘట్మీకా గ్రామానికి చెందిన నసీర్, జునైద్‌లను ఫిబ్రవరి 15న గోసంరక్షకులు అపహరించినట్లు ఆరోపణలు వచ్చాయి, మరుసటి రోజు హర్యానాలోని భివానీలోని లోహారులో వారి మృతదేహాలు కాలిపోయిన కారులో కనుగొనబడ్డాయి. రాజస్థాన్ పోలీసులు ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసి మోను మనేసర్‌ను నిందితుడిగా పేర్కొన్నారు.