పెళ్లైన రెండు నెలలకు భార్య హిజ్రా అని తెలియడంతో...!

Published : Jun 23, 2021, 09:34 AM IST
పెళ్లైన రెండు నెలలకు భార్య హిజ్రా అని తెలియడంతో...!

సారాంశం

తన భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని పరీక్షల్లో తేలడంతో షాక్ గురైన భర్త అత్తమామలపై ఫిర్యాదు చేశారు.

ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగి రెండు నెలలు గడిచిన తర్వాత.. తాను చేసుకుంది ఓ అమ్మాయిని కాదని... హిజ్రా అని తెలుసుకొని షాకయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. అమ్మాయి అని చెప్పి తనను మోసం చేశారంటూ సదరు హిజ్రా, ఆమె తల్లిదండ్రులపై  పోలీసులకు ఫిర్యాదు చేశాడు.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

.కాన్పూర్ నగర నివాసి అయిన యువకుడు శాస్త్రినగర్ లోని పంకి ప్రాంతానికి చెందిన యువతిని ఏప్రిల్ 28వతేదీన వివాహమాడారు. వివాహం అనంతరం వరుడు వధువుతో శారీరక సంబంధం ఏర్పరచుకోలేక పోయాడు. తన భార్య లింగమార్పిడి చేయించుకుందని, ఆమె జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదని గుర్తించి ఆమెను వైద్య పరీక్ష కోసం గైనకాలజిస్టు వద్దకు తీసుకువెళ్లాడు.

తన భార్య లింగమార్పిడి చేయించుకున్న హిజ్రా అని పరీక్షల్లో తేలడంతో షాక్ గురైన భర్త అత్తమామలపై ఫిర్యాదు చేశారు. తన భార్య వైద్య నివేదికతో వధువు, ఆమె తల్లిదండ్రులు, వివాహ మధ్యవర్తిపై భర్త ఫిర్యాదు చేయడంతో వారిపై తాము ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తమామలతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు