చేతుల్లో రోజుల బిడ్డతో.. విధుల్లోకి ఏపీ లేడీ ఐఏఎస్ అధికారి

By telugu news team  |  First Published Apr 13, 2020, 2:18 PM IST

కరోనా విజృంభణ సమయంలో విధులు నిర్వహించడం ఓ మనిషిగా ఇది తన బాధ్యతతని ఆమె చెప్పారు. తాను తిరిగి విధుల్లో చేరితే తమ పరిపాలన విభాగానికి కాస్త సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. 


కరోనా వైరస్ దేశంలో రోజు రోజుకీ విజృంభిస్తోంది. ఈ క్రమంలో దేశాన్ని రక్షించే బాధ్యత చాలా మంది చేతిలో ఉంది. అందులో ఐఏఎస్ ల బాధ్యత కూడా ఉంది. ఈ బాధ్యతను నెరవేర్చేందుకు ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి చేతిలో నెలల పసికందుతో విధుల్లో చేరడం గమనార్హం. ఆమె సృజన గుమ్మల.

నెల రోజుల క్రితం ఆమె బిడ్డకు జన్మనివ్వగా.. ఇంకా ఐదు నెలల మెటర్నరీ సెలవలు ఉన్నాయి. వాటిని వినియోగించుకోకుండా బిడ్డతో సహా ఆమె విధుల్లో చేరడం గమనార్హం. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గ్రేటర్ విశాఖ పట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌  సృజన గుమ్మల్ల విధి నిర్వహణలో చూపిస్తోన్న నిబద్ధతపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  

కరోనా విజృంభణ సమయంలో విధులు నిర్వహించడం ఓ మనిషిగా ఇది తన బాధ్యతతని ఆమె చెప్పారు. తాను తిరిగి విధుల్లో చేరితే తమ పరిపాలన విభాగానికి కాస్త సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు. ఈ సమయంలో అందరూ కలిసి పని చేస్తే ఈ పోరులో మరింత బలం చేకూరుతుందని ఆమె అంటున్నారు. ఆమె 2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందని అధికారిణి.  

'కరోనాపై పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టం. పని పట్ల నిబద్ధత చూపుతూ అటువంటి యోధులకు ఓ ఉదాహరణగా నిలుస్తోన్న ఆమెకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు' అని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ట్వీట్ చేశారు.  

కాగా.. ఆమెపై ఇప్పుడు నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రజలు ఆమె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి మరీ అభినందిస్తున్నారు.

click me!