కరోనా ఎఫెక్ట్: పెళ్లి వాయిదా వేసుకొని విధుల్లో చేరిన కేరళ నర్స్

By narsimha lodeFirst Published Apr 13, 2020, 1:20 PM IST
Highlights
కేరళ రాష్ట్రంలోని  కన్నూరు జిల్లా ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే సౌమ్య విధుల్లో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె తన పెళ్లిని కూడ వాయిదా వేసుకొన్నారు.
తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని  కన్నూరు జిల్లా ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే సౌమ్య విధుల్లో చేరేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ఆమె తన పెళ్లిని కూడ వాయిదా వేసుకొన్నారు.

గత శుక్రవారం నాడు ఆమెకు రెండు వారాల డ్యూటీ తర్వాతసెలవు మంజూరైంది.  రెండు వారాల పాటు ఆమె కరోనా రోగులకు సేవ చేసినందుకు గాను ఆమె మరో రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆమె ఈ నెల 20వ తేదీన విధుల్లో చేరనున్నారు.

కరోనా వైరస్ సంక్షోభం తీరిన తర్వాత తాను పెళ్లి చేసుకొనే తేదీపై నిర్ణయం తీసుకొంటామని ఆమె ప్రకటించారు.కొట్టాయం ప్రాంతానికి చెందిన సౌమ్యకి  త్రిక్కారిపూర్ కు చెందిన రేజీ నారియన్ తో ఈ నెల 8వ తేదీన పెళ్లి నిశ్చయించారు.

అయితే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో  పెళ్లిని ఈ నెల 26న చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.అయితే అదే సమయంలో కరోనా వైరస్ వార్డులో సౌమ్యకు విధుల్లో నియమించారు.సౌమ్యకు పెళ్లి ఉన్నందున ఆమెకు సెలవు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. కానీ ఆమె మాత్రం సెలవు తీసుకొనేందుకు అంగీకరించలేదు.

రోజులు గడిచిపోతున్నాయి. ఐసోలేషన్ వార్డుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడ తమ బంధువుల మాదిరిగా ఉన్నారని సౌమ్య చెప్పారు. అంతేకాదు ఇదే తన పెద్ద ఇల్లుగా భావిస్తున్నట్టుగా ఆమె అభిప్రాయపడ్డారు.

నెలన్నర రోజులుగా తాను ఇంటికి వెళ్లలేదని సౌమ్య చెప్పారు.సౌమ్యతో పాటు మరో 24 మంది నర్సులు రెయిన్ బో ఆసుపత్రిలో క్వారంటైన్ లో ఉన్నారు. ఈ నెల 20  వ తేదీన సౌమ్య విధుల్లో చేరనున్నారు.

 
click me!