ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ

Published : Jul 01, 2023, 02:02 PM ISTUpdated : Jul 01, 2023, 02:07 PM IST
ఈ నెల  20వ తేదీ నుండి  పార్లమెంట్ సమావేశాలు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ

సారాంశం

ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంట్ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి.  పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ ఈ విషయాన్ని ప్రకటించారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు  ఈ నెల  20వ తేదీ నుండి ప్రారంభంకానున్నాయి.   ఈ ఏడాది ఆగష్టు   11న పార్లమెంట్ సమావేశాలు ముగియనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ  శనివారంనాడు ప్రకటించారు.

పార్లమెంట్ సమావేశాలకు  విపక్షాలను  సహకరించాలని  ప్రహ్లాద్ జోషీ కోరారు.వచ్చే ఏడాదిలో  లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.  ఈ  ఏడాది చివర్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు  జరగనున్నాయి

. ఈ తరుణంలో  విపక్షాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో కూడ అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు  విపక్షాలు  ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. యూనిఫామ్ సివిల్ కోడ్  అములపై   ఈ సమావేశాల్లో  చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషన్ కేపిటల్ టెరిటరీ(సవరణ) ఆర్డినెన్స్ స్థానంలో ప్రభుత్వం  బిల్లును తీసుకువచ్చే అవకాశం ఉంది.కొత్త పార్లమెంట్ భవనంలో  పార్లమెంట్ సమావేశాలు  జరిగే  అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

New Year: 2026.. ఈ నెంబ‌ర్ చాలా స్పెష‌ల్‌, 20 ఏళ్లకు ఒక‌సారే ఇలా జ‌రుగుతుంది
టార్గెట్ 2035 .. ఈ రాష్ట్రంలో మురుగునీరే ఉండదట