ఈ ఏడాది ఆగష్టు మాసంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు.పార్లమెంట్ సమావేశాల్లో నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడుతామని మంత్రి తెలిపారు.
న్యూఢిల్లీ:ఈ ఏడాది ఆగష్టు మాసంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తామని కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి తెలిపారు.పార్లమెంట్ సమావేశాల్లో నిబంధనలకు అనుగుణంగా అన్ని ముందస్తు జాగ్రత్తలను చేపడుతామని మంత్రి తెలిపారు.ఆదివారం నాడు ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో రెండు సభల్లో 19 బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఆగష్టు రెండు లేదా మూడో వారంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్టుగా ఆయన తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారా కేబినెట్ సమావేశంలో ఉభయ సభల సమావేశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
undefined
also read:రాజ్‌భవన్‌లో 18 మందికి కరోనా: ఐసోలేషన్‌లోకి గవర్నర్
పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై లోక్ సభ, రాజ్యసభ సెక్రటేరియట్ల ద్వారా ఎంపీల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. లోక్ సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మెన్ లు కూడ ఎంపీలతో చర్చిస్తున్నారు.
కొందరు సభ్యులు పార్లమెంట్ కు హాజరైతే మరికొందరు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం కూడ ఉంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి వీలుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశాలు నిర్వహించే యోచన కూడ చేపట్టారు.