డాక్టర్‌పై కేసు:పని మనిషి పేరుతో భార్య శాంపిల్స్

By narsimha lodeFirst Published Jul 12, 2020, 3:33 PM IST
Highlights

కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిల్స్ ను పనిమనిషి పేరిట పంపిన వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
 

భోపాల్: కరోనా లక్షణాలతో బాధపడుతున్న తన భార్య శాంపిల్స్ ను పనిమనిషి పేరిట పంపిన వైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సింగ్రౌలి ప్రాంతంలో ఓ వ్యక్తి ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు.  ఇటీవల కుటుంబసభ్యులతో కలిసి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పెళ్లికి హాజరయ్యాడు. జూన్ 23వ తేదీన  పెళ్లికి హాజరై జూలై 1వ తేదీన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.

నిబంధనల ప్రకారంగా హోం క్వారంటైన్‌లో ఉండాలి. అవన్నీ పట్టించుకోకుండా ఆయన విధులకు హాజరయ్యాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయన భార్యలో కరోనా లక్షణాలు కన్పించాయి. దీంతో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే తాను యూపీకి వెళ్లి వచ్చిన విషయం బయట పడుతోందని భావించారు.

also read:24 గంటల్లో 19 మంది మృతి: ఏపీలో 29,168కి చేరిన కరోనా కేసులు

తన భార్య శాంపిళ్లను తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరిట పంపించాడు.  అయితే ఈ శాంపిల్స్ కరోనా పాజిటివ్ గా తేలింది.దీంతో డాక్టర్ ఇంట్లో పనిమనిషి ఇంటికి అధికారులు వెళ్లారు. దీంతో అసలు విషయం వెలుగు చూసింది.

దీంతో డాక్టర్ ఇంట్లో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యుడితో పాటు ఇంట్లోని మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. 
కరోనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఇతరుల పేరుతో శాంపిళ్లను పంపినందుకు ఆ వైద్యుడిపై ఎపిడమిక్ చట్టం కింద కేసు నమోదు చేశారు. 

ఆసుపత్రి నుండి డిశ్చార్జి అయిన తర్వాత వైద్యుడిపై చర్యలు తీసుకొంటామని పోలీసులు ప్రకటించారు. మరో వైపు వైద్యుడు పనిచేసే కార్యాలయంలో 33 మంది కూడ ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది.
 

click me!