కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు: రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తరణ

Published : May 29, 2022, 02:04 PM IST
కేరళను తాకిన నైరుతి రుతు పవనాలు: రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తరణ

సారాంశం

కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్టుగా ఐఎండీ ప్రకటించింది. ఈ నెల 27న నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తాయని భావించినప్పటికీ రెండు రోజులు ఆలస్యంగా కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి. రెండు మూడు రోజుల్లో రుతు పవనాలు రాష్ట్రంలో విస్తరిస్తాయి.

న్యూఢిల్లీ: Kerala రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. నిర్ణీత షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించినట్టుగా భారత వాతావరణ శాఖ ప్రకటించింది. జూన్ 1వ తేదీ నాటికి Southwest monsoon కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తొలుత భావించారు. అయితే రెండు రోజుల ముందుగానే కేరళ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్టుగా భారత వాతావరణ శాఖ ఆదివారం నాడు ఉదయం ప్రకటించింది. ఈ నెల 14న IMD అంచనాల మేరకు ఈ నెల 27నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేసింది. 

అయితే వాతావరణంలో మార్పులతో కేరళలో రుతుపవనాల ప్రవేశం కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ఆ తర్వాత ప్రకటించింది. ఈ నెల 27న రుతు పవనాలు కేరళలో ప్రవేశించడానికి  పరిస్థితులు మరింత మెరుగు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది.  

దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పశ్చిమ గాలులు బలపడ్డాయి. దీంతో కేరళ తీరం, దానిని ఆనుకొని ఆగ్నేయ ఆరేబియా సముద్రం ప్రాంతం మేఘావృతం పెరిగింది. దీంతో రానున్న రెండు మూడు రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఈ నెల 27న ఐఎండీ ప్రకటించింది. 

అంతేకాదు లక్షద్వీప్, అరేబియా సముద్రం ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడానికి కూడా పరిస్థితుులు అనుకూలంగా ఉన్నాయని ఆ ప్రకటనలో ఐఎండీ తెలిపింది.నైరుతి రుతుపవనాలు భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్ధిక వ్యవస్థకు జీవనాధారంగా పరిగణించనున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?