జమ్మూకాశ్మీర్ ‌లో కలకలం: కథువాలో డ్రోన్ కూల్చివేత

Published : May 29, 2022, 01:16 PM ISTUpdated : May 29, 2022, 01:39 PM IST
జమ్మూకాశ్మీర్ ‌లో కలకలం: కథువాలో డ్రోన్  కూల్చివేత

సారాంశం

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని కథువా జిల్లాలో ఆదివారం నాడు తెల్లవారుజామున డ్రోన్ ను భద్రతా దళాలు పేల్చివేశాయి. ఈ డ్రోన్ లో పేలుడు పదార్ధాలున్నట్టుగా అనుమానిస్తున్నారు.

శ్రీనగర్: Jammu Kashmir  పోలీసులు ఆదివారం నాడు తెల్లవారుజామున హీరానగర్ సెక్టార్ పరిధిలోని Kathuva  జిల్లా  తల్లి హరియా చక్ గ్రామంలో పాకిస్తాన్  వైపు నుండి వస్తున్న డ్రోన్ ను కూల్చివేశారు. ఈ డ్రోన్ ను కూల్చివేసిన తర్వాత బాంబ్ స్వ్కాడ్ ను పిలిపించారు.

 

Talli Hariya Chak లో Drone కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం రావడంతో రాజ్‌బాగ్ పోలీస్ స్టేషన్ నుండి సంఘటన స్థలానికి పోలీస్ బృందాన్ని పంపినట్టుగా భద్రతా వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సరిహద్దు గుండా భారత్ వైపు వస్తున్న డ్రోన్ ను పోలీసులు కూల్చివేశారు. ఈ డ్రోన్ లో పేలుడు పదార్ధాలున్నాయా అనే అనుమానంతో భద్రతా దళాలు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. 

ఈ ఏడాది ఏప్రిల్ 30న  పంజాబ్‌లోని అమృత్‌సర్ సెక్టార్‌లో పాకిస్థాన్ నుంచి వస్తున్న డ్రోన్‌ను కూల్చివేసినట్లు సరిహద్దు భద్రతా దళం వెల్లడించింది. అమృత్‌సర్ సెక్టార్‌లోని ధనో కలాన్ గ్రామ సమీపంలోని ప్రాంతంలో తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో డ్రోన్ భారత భూభాగంలోకి ప్రవేశించింది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి మోహరించిన BSF సిబ్బంది ఎగిరే వస్తువు శబ్దం విని దానిని కాల్చి వేశారు.

 మే 1న ఉదయం 6.15 గంటల ప్రాంతంలో ధనో కలాన్ గ్రామం సమీపంలో సెర్చ్ టీమ్ బ్లాక్ కలర్ 'మేడ్ ఇన్ చైనా' క్వాడ్‌కాప్టర్ (డ్రోన్), మోడల్ DJI మ్యాట్రిస్-300ని స్వాధీనం చేసుకున్నారు భద్రతా దళాలు. .  అందులో ఏమైనా పేలుడు ప‌దార్థాలు ఉన్నాయా?  లేవా? అనేది నిర్ధారించుకున్న త‌రువాత డ్రోన్ ను స్వాధీనం చేసుకున్న‌ట్టు  అధికారులు తెలిపారు.  

భారత్‌కు ఆయుధాలు, మాదక ద్రవ్యాలను రవాణా చేయడానికి పాకిస్తాన్‌లోని భారత వ్యతిరేక శక్తులు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాయి. పంజాబ్ సరిహద్దులో హెరాయిన్ వంటి మాదకద్రవ్యాలను రవాణా చేయడానికి డ్రోన్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని భద్రతా వర్గాలు చెప్పాయి.  జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాలు డ్రోన్‌ను కూల్చివేసిన తర్వాత ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు.  

also read:డ్రోన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022లో పాల్గొన్న ఆస్టెరియా ఏరోస్పేస్.. డ్రోన్‌ను ఎగరేసిన ప్రధాని..

ఇటీవలనే పాకిస్థాన్‌కు చెందిన 55 ఏండ్ల వ్యక్తి ఎలాంటి అనుమ‌తి లేకుండా సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించాడు. గమనించిన భద్రతా సిబ్బంది అతడ్ని అరెస్ట్‌ చేశారు. జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఈ సంఘటన జరిగింది. తుర్కుండి ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థానీ వ్యక్తిని అరెస్ట్‌ చేసి మంజకోట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అతడి వద్ద ఒక గొడ్డలి, పా‌క్‌ కరెన్సీ ఉన్నట్లు భద్రతా సిబ్బంది తెలిపారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?