చల్లటి కబురు: కేరళను తానికి నైరుతి రుతుపవనాలు

By narsimha lode  |  First Published Jun 8, 2023, 1:37 PM IST

కేరళను నైరుతి రుతుపవనాలు తాకినట్టుగా  ఐఎండీ  ఇవాళ  ప్రకటించింది.  గత ఏడాదితో పోలిస్తే వారం రోజులు ఆలస్యంగా  నైరుతి రుతుపవనాలు  ఆలస్యంగా  కేరళలోకి ప్రవేశించాయి. 


న్యూఢిల్లీ:  కేరళ రాష్ట్రాన్ని  నైరుతి రుతుపవనాలు తాకాయి.ఈ విషయాన్ని ఐఎండీ  ప్రకటించింది. కేరళ రాష్ట్రంలోని  పలు ప్రాంతాల్లో బుధవారం నాడు వర్షపాతం నమోదైంది. ఆగ్నేయ అరేబియా  సముద్రం మీదుగా  అల్పపీడనం  ఏర్పడింది. దీని తీవ్రతతో  వచ్చే రెండు  రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని  ఈ నెల  5వ తేదీన  వాతావరణ  శాఖ  తెలిపింది.

ఈ నెల 8, 9 తేదీల్లో  కేరళలో  రుతుపవనాలు  తాకే అవకాశం ఉందని   ఓ ప్రైవేట్  వాతావరణ సంస్థ పేర్కొంది   సాధారణంగా  నైరుతి రుతుపవనాలు  జూన్ 1.వ తేదీన  ప్రవేశిస్తాయి.  అయితే  ఈ ఏడాది ఏడు రోజులు ఆలస్యంగా   కేరళలో  రుతుపవనాలు  ప్రవేశించాయి.48  గంటల్లో  కేరళ రాష్ట్రంలో  రుతుపవనాలు  విస్తరిస్తాయని  ఐఎండీ తెలిపింది.  తమిళనాడు,  కర్ణాటకలో  నైరుతి రుతుపవనాలు  విస్తరిస్తాయని ఐఎండీ తెలిపింది. 

Latest Videos

గత ఏడాది మే  29న, 2021 జూన్  3న, 2020లో జూన్  1న,  2019లో జూన్ 8న, 2018లో మే 29న  కేరళ రాష్ట్రాన్ని రుతుపవనాలు తాకాయి. కేరళ రాష్ట్రాన్ని ఆలస్యంగా  రుతుపవనాలు తాకాయి. దేశ వ్యాప్తంగా  రుతుపవనాలు  విస్తరించడానికి  మరింత  సమయం పట్టే అవకాశం ఉంది.రుతుపవనాలు  విస్తరించేందుకు వారం రోజుల సమయం పట్టే  అవకాశం ఉందని  ఐఎండీ  తెలిపింది.గత  20 ఏళ్లలో  జూన్ 8 తర్వాత  నైరుతి రుతుపవనాలు  కేరళను తాకలేదు.

click me!