ఇది కదా విశ్వాసం అంటే... వ్యక్తి అంత్యక్రియలకు కోతి...!

Published : Oct 22, 2022, 03:09 PM IST
 ఇది కదా విశ్వాసం అంటే... వ్యక్తి అంత్యక్రియలకు కోతి...!

సారాంశం

ఓ వ్యక్తి రోజూ తిండి పెట్టాడని... ఆ వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలకు కూడా కోతి వెళ్లింది.  వెళ్లడమే కాదు... ఆ కోతి అతని శవం పై కూర్చొని ఏడుస్తూ ఉండటం గమనార్హం. 

మనుషులతో పోలిస్తే.. జంతువులకు విశ్వాసం ఎక్కువగా ఉంటుంది అని  చాలా మంది చెబుతుంటే వినే ఉంటారు. మనం కొంచెం తిండి పెడితే  చాలు... ఆ జంతువులు చాలా విశ్వాసం చూపిస్తాయి.  ఇందుకు నిదర్శనంగా  తాజాగా ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోజూ తిండి పెట్టాడని... ఆ వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియలకు కూడా కోతి వెళ్లింది.  వెళ్లడమే కాదు... ఆ కోతి అతని శవం పై కూర్చొని ఏడుస్తూ ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన  వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

ఈ సంఘటన శ్రీలంకలోని తూర్పు ప్రావిన్స్ లోని బట్టికలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తి,... తరచూ ఆ కోతికి భోజనం పెట్టేవాడట. అంతేకాదు.. ఆ కోతితో స్నేహంగా ఉండేవాడట. అయితే... అనుకోకుండా సదరు వ్యక్తి ఈ నెల 18వ తేదీన ఆ వ్యక్తి మరణించాడు. ప్రతిరోజూ ఆహారం కోసం వచ్చిన  కోతికి.. అతను చనిపోయి ఉండటం చూసింది. వెంటనే.. అతని శరీరంపై కి ఎక్కి బాధగా కూర్చుంది. రెండు సార్లు.. తట్టి లేపడానికి కూడా ప్రయత్నించింది. ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జనాలకు ఈ వీడియో విపరీతంగా నచ్చేసింది. నిజమైన ప్రేమ, విశ్వాసం అంటే ఇదే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

వెనకా, ముందు ఎస్కార్ట్ రైళ్లు.. మధ్యలో రాష్ట్రపతి కోసం ప్రత్యేక రైలు. ఇదొక న‌డిచే రాజ‌భ‌వ‌నం
డ్రగ్స్ రహిత సమాజం కోసం మోదీ మాస్టర్ ప్లాన్ | Nasha Mukt Yuva for Viksit Bharat Explained