
ప్రభుత్వం నుంచి భారీగా జీతభత్యాలు వస్తున్నా కొందరు అక్రమార్కులు దొడ్డిదారిన సంపాదిస్తున్నారు. లక్షలు, కోట్లలో లంచాలు (bribe) వసూలు చేస్తూ వాటిని దాచేందుకు తిప్పలు పడుతున్నారు. ఇంటి గోడల్లోనో, బాత్‌రూమ్‌లోనో ఆ డబ్బును దాచిన ఘటనలు మనం ఎన్నో చూశాం. తాజాగా కర్ణాటకలో ఓ అధికారి ఏకంగా తన అవినీతి సంపాదనను పైప్‌లైన్‌లో ( pipe ) దాచి వుంచాడు. అయినప్పటికీ ఏసీబీ (Anti Corruption Bureau) అధికారులు దానిని పట్టేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలో (Karnataka) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారుల ఇళ్లల్లో ఏసీబీ బుధవారం సోదాలు జరిపింది. ఈ నేపథ్యంలో కలబురిగి (Kalaburagi ) జిల్లా పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజినీర్ (PWD engineer) శాంతా గౌడ్ బిరదర్ ( Shanthanagouda Biradar ) ఇంట్లో సోదాలు చేసిన అధికారులు అతడి అక్రమ సంపాదన చూసి అవాక్కయ్యారు. ఈ సోదాల్లో ఆయన ఇంట్లో రూ. 25 లక్షల నగదు, పెద్ద మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ALso Read:ఏసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం... కోట్లల్లో అక్రమాస్తులు
శాంతాగౌడ్ తన ఇంట్లో ఉన్న పైపులైన్లలో నగదు దాచి ఉంచాడన్న సమాచారం అందుకున్న అధికారులు.. ఓ ప్లంబర్‌ను తీసుకొచ్చి వాటిని పగులగొట్టించారు. దీంతో పైపులైన్ నుంచి కరెన్సీ నోట్లు కిందకు పడటం చూసి అధికారులు అవాక్కయ్యారు. నల్లధనం కోసమే ఈ పైపులను ఇంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాగా.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా 15 మంది అధికారులకు సంబంధించిన నివాసాలపై ఏసీబీ అధికారులు 60 చోట్ల సోదాలు చేశారు.