మనీలాండరింగ్ కేసు: ఈ నెల 24న హాజరుకావాలని హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు

Published : Aug 20, 2023, 12:53 AM IST
మనీలాండరింగ్ కేసు: ఈ నెల 24న హాజరుకావాలని హేమంత్ సోరెన్‌కు ఈడీ సమన్లు

సారాంశం

money laundering case: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి త‌మ ముందు హాజ‌రుకావాల‌ని జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ కు దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచార‌ణ‌కు ఆగస్టు 24న త‌మ‌ముందు హాజ‌రుకావాల‌ని సోరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.  

Jharkhand Chief Minister Hemant Soren: మనీలాండరింగ్ కేసుకు సంబంధించి త‌మ ముందు హాజ‌రుకావాల‌ని జార్ఖండ్ ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ కు దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో విచార‌ణ‌కు ఆగస్టు 24న త‌మ‌ముందు హాజ‌రుకావాల‌ని సోరెన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.

వివ‌రాల్లోకెళ్తే.. మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆగస్టు 24న తమ ముందు హాజరుకావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. దీనిపై స్పందించిన రాష్ట్ర పార్టీ చీఫ్ రాజేష్ ఠాకూర్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. 'దర్యాప్తు సంస్థ కేవలం కథనాన్ని సృష్టిస్తోంది. ఆగస్టు 14న సీఎం జెండా ఎగురవేయాల్సి ఉండగా ఆగస్టు 15న మీ ముందు హాజరుకావాలని మీరు (ఈడీ) కోరారు. అలాంటప్పుడు ఆగస్టు 24న ఆయన్ను మ‌ళ్లీ ఎందుకు పిలిపిస్తున్నారు? ఆగస్టు 17 లేదా 18 తేదీల్లో హాజరుకావాలని మీరు కోరవచ్చు క‌దా' అంటూ పేర్కొన్నారు.

అంత‌కుముందు, భూకుంభకోణం కేసులో జార్ఖండ్ సీఎంకు ఆగస్టు 14న విచారణ సంస్థ సమన్లు జారీ చేసింది. అయితే, రాష్ట్రంలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉన్నందున సోరెన్ ఈడీ ముందు హాజరుకాలేదు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆగస్టు 14న ఫెడరల్ ఏజెన్సీ కార్యాలయంలో హాజరై వాంగ్మూలం నమోదు చేయాలని ఈడీ సోరెన్ కు నోటీసులు పంపింది. ''బిజీ షెడ్యూల్, ముందస్తుగా నిర్ణయించిన సమావేశాల దృష్ట్యా ముఖ్యమంత్రి ఈ రోజు ఈడీ ముందు హాజరుకాలేదు. ఈడీ సమన్ల సమయాన్ని ఆయన ప్రశ్నించారు'' అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు.

48 ఏళ్ల జార్ఖండ్ ముక్తి మోర్చా నేతను గత ఏడాది నవంబర్ 17న రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కు సంబంధించిన కేసుతో పాటు మరో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ తొమ్మిది గంటలకు పైగా విచారించింది. 1932 నాటి దస్తావేజులు, డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసేందుకు మాఫియా, దళారులు, బ్యూరోక్రాట్లు కుమ్మక్కయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రక్షణ భూములతో సహా డజనుకు పైగా భూ దందాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది.

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu