
లడఖ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న వాహనం లోయలో పడటంతో 9 మంది సైనికులు అమరులయ్యారు. శనివారం సాయంత్రం దక్షిణ లడఖ్‌లోని నియోమాలోని కెరీ వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న భారత సైన్యం, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.