మనీలాండరింగ్ కేసు: త‌మిళ‌నాడు మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడిని అరెస్టు చేసిన ఈడీ

Published : Aug 13, 2023, 04:55 PM IST
మనీలాండరింగ్ కేసు: త‌మిళ‌నాడు మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడిని అరెస్టు చేసిన ఈడీ

సారాంశం

Chennai: మనీలాండరింగ్ కేసుల్లో సెంథిల్ బాలాజీ సోదరుడిని దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అరెస్ట్ చేసింది. "మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింద‌నీ, మంత్రి సోదరుడు అనేక సమన్లను దాటవేయడంతో ఈ అరెస్టు జరిగిందని" సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.   

Probe agency ED arrests Senthil Balaji's brother: మనీలాండరింగ్ కేసుల్లో సెంథిల్ బాలాజీ సోదరుడిని దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అరెస్ట్ చేసింది. "మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింద‌నీ, మంత్రి సోదరుడు అనేక సమన్లను దాటవేయడంతో ఈ అరెస్టు జరిగిందని" సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

వివ‌రాల్లోకెళ్తే.. మనీలాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం కేరళలోని కొచ్చిలో అరెస్టు చేసింది. దర్యాప్తు సంస్థ పంపిన పలు సమన్లను మంత్రి సోదరుడు దాటవేయడంతో ఈ అరెస్టు జరిగింది. మంత్రిని విచారిస్తున్న అదే ఈడీ బృందం బాలాజీ సోదరుడిని అరెస్టు చేసింది. సెంథిల్ బాలాజీపై చార్జిషీట్ దాఖలు చేసిన మరుసటి రోజే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ చర్య తీసుకోవడం గమనార్హం. మనీలాండరింగ్ కేసులో డీఎంకే ఎమ్మెల్యేపై దర్యాప్తు సంస్థ 3000 పేజీల చార్జిషీట్ దాఖలు చేసింది.

ఇప్పటి వరకు సెంథిల్ బాలాజీ పేరును మాత్రమే చార్జిషీట్ లో చేర్చారు. డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన బంధువులు సంపాదించిన ఆస్తులపై పలు దఫాలుగా దాడులు, సమగ్ర విచారణ అనంతరం అశోక్ భార్య నిర్మలకు చెందిన ఆస్తులను ఆగస్టు 10న ఈడీ స్తంభింపజేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెన్నైలోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన క్యాష్ ఫర్ జాబ్ కేసు ఆధారంగా ఈడీ ప్రారంభించిన మనీలాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని జూన్ 14న అరెస్టు చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ ఐదు రోజుల విచారణ అనంతరం శనివారం (ఆగస్టు 12) సెంథిల్ బాలాజీకి ఆగస్టు 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కొద్ది రోజుల క్రితం ఆగస్టు 7న సెంథిల్ బాలాజీని విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. డీఎంకే నేతను పుళల్ సెంట్రల్ జైలులో ఉంచారు.

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?