ఎన్ కౌంటర్ కు ముందు.. టెర్రరిస్టుకు వీడియోకాల్ చేసిన ఆర్మీ అధికారి.. అతనేమన్నాడంటే..

By SumaBala BukkaFirst Published Sep 30, 2022, 10:59 AM IST
Highlights

జమ్మూ కశ్మీర్ లో మూడు రోజుల క్రితం జరిగిన టెర్రరిస్టుల ఎన్ కౌంటర్ కు ముందు ఓ ఆర్మీ అధికారి.. తీవ్రవాదికి చేసి వీడియో కాల్ ఇప్పుడు సంచలనంగా మారింది. 

జమ్ము కశ్మీర్ : సెప్టెంబర్ 27న J&Kలోని కుల్గాం జిల్లా అహ్వాటూ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకరు జైష్-ఎ-మొహమ్మద్ సభ్యుడు మహమ్మద్ షఫీ గనై. అయితే,  ఎన్‌కౌంటర్‌కు కొద్ది క్షణాల ముందు అతను భారత ఆర్మీ అధికారితో మాట్లాడిన వీడియో కాల్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 

అధికారుల సూచన మేరకు భారత సైన్యం కుల్గామ్‌లోని అహ్వాటూ ప్రాంతంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆపరేషన్ సమయంలో, ఒక భారతీయ అధికారి మహమ్మద్ షఫీ గనైకి వీడియో కాల్ చేశాడు. లొంగిపోవాలని కోరాడు. కానీ గనై అందుకు నిరాకరించాడు. జమ్మూ కాశ్మీర్ కు ఎంతమంది సైన్యం సపోర్టు చేస్తారో, సైన్యానికి ఎంతమంది కశ్మీరీలు సపోర్ట్ చేస్తారో.. అంటూ మాట్లాడుతూ పోతుంటే.. ఆ సైనికాధికారి.. ‘నేను ఆర్మీ అధికారినే.. ఫ్రెండ్ నువ్వు సరెండర్ అవ్వు.. అది నేను నిన్ను అడుగుతున్నా’.. అంటూ సంభాషణ మొదలు పెట్టాడు.

హనీ ట్రాప్.. ఆపదలో ఉన్నానంటూ పిలిపించి, గదిలోకి తీసుకెళ్లి.. వీడియో తీసి.. బ్లాక్ మెయిల్..

దీనికి టెర్రరిస్ట్ గనై మాట్లాడుతూ.. ‘నేను చావుకు దగ్గరపడ్డానని నాకు తెలుసు.. మీరు నా నాలుగైదు బుల్లెట్లు కాలుస్తారు. లేదంటే ఎక్కువలో ఎక్కు ఒక మ్యాగజైన్ ఖాళీ చేస్తారు నన్ను చంపడానికి.. అంతేకదా’.. అంటే..‘అరే దోస్త్.. అలా చేయం.. కానీ నువ్వు లొంగిపో’ అంటూ అధికారి చెప్పుకొచ్చారు. ఆ తరువాత కాసేపటికే అతను ఎన్ కౌంటర్ లో మరణించాడు. అయితే ఆ వీడియో కాల్ లో గనై ఆర్మీ ఆధికారుల పనితీరును కొనియాడడం కూడా కనిపిస్తుంది. 

కార్డన్ సెర్చ్ మొదలుపెట్టగానే టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించారు..దీంతో సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించింది. ఎన్ కౌంటర్ తరువాత వీరి వద్దనుంచి రెండు ఏకే సిరీస్ రైఫిల్స్ ను, గ్రనైడ్లను స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో, జమ్మూకాశ్మీర్‌లోని ఉదంపూర్‌లో రెండు రహస్య పేలుళ్లు సంభవించాయి. 

 

ఎన్ కౌంటర్ కు ముందు.. టెర్రరిస్టుకు వీడియోకాల్ చేసిన ఆర్మీ అధికారి.. pic.twitter.com/5Vwcc3XAuT

— Asianetnews Telugu (@AsianetNewsTL)
click me!