హాస్పిటల్ వార్డులో కాల్ గర్ల్ తో క్రిమినల్ సరసాలు....!

Published : Sep 30, 2022, 09:33 AM IST
 హాస్పిటల్ వార్డులో కాల్ గర్ల్ తో క్రిమినల్ సరసాలు....!

సారాంశం

పోలీసులు బుధవారం హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించగా.. అక్కడ జరుగుతున్నది చూసి షాకయ్యారు.  

అతను ఓ నేరస్తుడు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి.  ఆరోగ్యం సరిగాలేదనే కారణంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. కానీ... అక్కడ హాస్పిటల్ లో అతను చేస్తున్న పని చూసి పోలీసులు కూడా షాకయ్యారు. అతను తన హాస్పిటల్ రూమ్ కి ఓ కాల్ గర్ల్ ని పిలిపించుకొని ఎంజాయ్ చేయడం గమనార్హం. ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్ రాష్ట్రం వైషాలీ జిల్లా, హజీపూర్ సాదర్ హాస్పిటల్ లో అసాంఘీక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో.. పోలీసులు బుధవారం హాస్పిటల్ లో తనిఖీలు నిర్వహించగా.. అక్కడ జరుగుతున్నది చూసి షాకయ్యారు.

హత్య కేసులో దోషిగా ఉన్న అమిత్ కుమార్ అనే నేరస్తుడు... ఓ యువతితో హాస్పిటల్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. నిజానికి ఆ నేరస్తుడు తనకు కేటాయించిన హాస్పిటల్ గదిలో లేడట. అతని కోసం వెతకగా.. డీ-అడిక్షన్ సెంటర్ లో యువతితో ఉన్నట్లు గుర్తించారు.

సదరు యువతి వేరే రాష్ట్రానికి చెందిన అమ్మాయి కాగా... హాస్పిటల్ లో పని చేసే వార్డు, సెక్యురిటీ గార్డులు ఆమెను బలవంతంగా.. కాల్ గర్ల్ గా ఆ నేరస్తుడు దగ్గరకు తీసుకురావడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్ పై చర్యలుు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial