2024లో కూడా ప్రధాని మోడీయే.. గుజ‌రాత్ ఎన్నిక‌లే నిద‌ర్శ‌నం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Published : Jan 15, 2023, 05:07 PM IST
2024లో కూడా ప్రధాని మోడీయే.. గుజ‌రాత్ ఎన్నిక‌లే నిద‌ర్శ‌నం:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా

సారాంశం

New Delhi: 2024లో కూడా ప్రధాని.. న‌రేంద్ర మోడీని అవుతార‌ని పేర్కొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ సందేశాన్ని అందించాయని తెలిపారు.  

Union Home Minister Amit Shah: రాబోయే 2024 లోక్ స‌భ‌ ఎన్నికల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) విజ‌యం సాధిస్తుంద‌నీ, ప్ర‌ధానమంత్రిగా నరేంద్ర మోడీనే ఉంటార‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ సందేశాన్ని పంపాయ‌ని తెలిపారు. గాంధీనగర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ప్రజలనుద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. గాంధీనగర్ నార్త్ సీటు బీజేపీది కాదు కానీ, ఇప్పుడు మీరంతా బీజేపీకి ఓటు వేశారు. అందువల్ల ఈ నియోజకవర్గంలోని అన్ని పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అమిత్ షా పేర్కొన్నారు. 'ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్' క్యాంపెయిన్ ఈ రోజు మోతీ అడ్రాజ్ నుంచి ప్రారంభమైందని, త్వరలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ను కూడా నిర్మిస్తామని తెలిపారు. అలాగే, నీటిని శుద్ధి చేయడానికి రూపాల్ లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను (ఎస్టీపీ) కూడా ప్రారంభించామని తెలిపారు.

 

గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసిన ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ నాయ‌క‌త్వంలోని ఆమ్ ఆద్మీ (ఆప్),  కాంగ్రెస్ ల గురించి ప్ర‌స్తావించిన అమిత్ షా.. తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. "ఈసారి, కాంగ్రెస్ ప్రజలు కొత్త రూపంతో వచ్చారు.. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ నుండి కొంతమంది కొత్త వ్యక్తులు కూడా  వచ్చారు.. కానీ వారు గెలుపును ఆప‌లేక పోయారు.. ప్ర‌జాబ‌లంతో అఖండ మెజారిటీతో బీజేపీ గెలిచింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రానికి ముఖ్యమైనవి మాత్రమే కాదు, ఇది గణనీయమైన సందేశాన్ని కూడా అందించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 2024లో కూడా ప్రధానిగా మోడీయే అవుతారని" అన్నారు.

 

 

2022లో ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 సీట్లతో రెండో స్థానంలో నిలవగా, గుజరాత్‌లో కొత్తగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఐదు సీట్లు గెలుచుకోగా, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఒక్క సీటు, మూడు సీట్లు గెలుచుకుంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు. మొత్తం 182 సీట్లలో 156 స్థానాల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు