అటల్‌జీ కానీ, మోడీజీ కానీ.. ఏ మీడియా సంస్థను బ్యాన్ చేయలేదు : రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Jan 15, 2023, 04:28 PM IST
అటల్‌జీ కానీ, మోడీజీ కానీ.. ఏ మీడియా సంస్థను బ్యాన్ చేయలేదు : రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

సారాంశం

అటల్‌జీ ప్రభుత్వమైనా, మోడీ ప్రభుత్వమైనా తాము ఏ మీడియా సంస్థపైనా నిషేధం విధించలేదన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. కాంగ్రెస్ పార్టీ చరిత్ర మొత్తం అన్ని రకాల స్వేచ్ఛలను ఉల్లంఘించిన ఘటనలతో నిండి వుందని దుయ్యబట్టారు

విపక్షాలపై మండిపడ్డారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించారని ఆరోపిస్తున్న వారు తమ పార్టీ ప్రభుత్వాలు ఏ మీడియా సంస్థపైనా ఎప్పుడు నిషేధం విధించలేదని ఆయన గుర్తుచేశారు. అలాగే ఎవరికీ తాము వాక్ స్వాతంత్ర్య హక్కును తగ్గించలేదన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకోవడానికి 1951లో ఆర్టికల్ 19 సవరణను ఆయన ప్రస్తావించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ వారపత్రిక పాంచజన్య నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. భావ ప్రకటనా స్వేచ్ఛపై దేశంలో మళ్లీ చర్చ ప్రారంభమైందన్నారు. నేడు మీడియా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తున్న వారు.. అది అటల్‌జీ ప్రభుత్వమైనా, మోడీ ప్రభుత్వమైనా తాము ఏ మీడియా సంస్థపైనా నిషేధం విధించలేదన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. 

ఇదే సమయంలో కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మంత్రి.. ఆ పార్టీ చరిత్ర మొత్తం అన్ని రకాల స్వేచ్ఛలను ఉల్లంఘించిన ఘటనలతో నిండి వుందని దుయ్యబట్టారు. వాక్ స్వేచ్ఛను అరికట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూడా సవరించిందని.. అద్దాల మేడల్లో వుండేవాళ్లు ఇతరులపై రాళ్లు రువ్వకూడదన్నారు. మీడియా ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమని.. దానికి స్వేచ్ఛ ఇవ్వడమేనేది శక్తివంతమైన ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గతంలో పాంచజన్యపై విధించిన నిషేధాలు, ఆంక్షల గురించి రక్షణ మంత్రి గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్‌ అనుబంధంగా నడిచే ఈ వారపత్రికపై పదే పదే అణిచివేత చర్యలకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది జాతీయవాద జర్నలిజంపై దాడి మాత్రమే కాదని, భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమన్నారు. 

Also Read : ‘ప్రజలకు క్షమాపణ చెప్పండి’ : కమల్‌నాథ్‌పై సీఎం శివరాజ్‌ ఎదురుదాడి

ఇకపోతే.. ఆర్మీ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం భారత సైన్యాన్ని ప్రశంసించారు. సైనికులు ఎల్లప్పుడూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచారని, సంక్షోభ సమయాల్లో వారి సేవలకు విస్తృతంగా ప్రశంసలు లభిస్తాయని అన్నారు.భారత సైన్యం మొదటి కమాండర్ ఇన్ చీఫ్ - జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) కె.ఎం.కరియప్ప సాధించిన విజయాలకు గుర్తుగా భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున, 1947 యుద్ధంలో భారత దళాలను విజయం వైపు నడిపించిన కరియప్ప, 1949 లో చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుండి భారత సైన్యం  కమాండ్ అధికారాల‌ను స్వీకరించారు.

ప్ర‌తి భార‌తీయుడు మ‌న సైన్యాన్ని చూసి ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. 'ఆర్మీ డే సందర్భంగా సైనికులందరికీ, అనుభవజ్ఞులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయుడు మన సైన్యాన్ని చూసి గర్వపడుతున్నాడు" అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. వారు ఎల్లప్పుడూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచారని, సంక్షోభ సమయాల్లో వారి సేవలకు విస్తృతంగా ప్రశంసలు లభిస్తాయని ఆయన అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు