Latest Videos

ఈ ఐదేళ్ళలో ఎవరూ ఊహించని సంస్కరణలు ... : ఇండియా గ్లోబల్ ఫోరమ్  ఛైర్మన్ 

By Arun Kumar PFirst Published Jun 14, 2024, 12:38 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోదీపై ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ మనోజ్ లడ్వా ప్రశంసలు కురిపించారు. ఎన్డిఏ ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో ఊహించని ఆర్థిక సంస్కరణలు చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

న్యూడిల్లీ : వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఎన్డీఏ కూటమి, ప్రధాని నరేంద్ర మోదీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇలా తాజాగా ఇండియా గ్లోబల్ ఫోరమ్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ మనోజ్ లడ్వా చారిత్రాత్మక విజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఎన్డిఏకు అభినందనలు తెలిపారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన అభినందించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్ కు గ్లోబల్ ఎకానమిక్ పవర్ హౌస్ గా మారే అవకాశాలున్నాయని అన్నారు. మోదీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టడం కలిసి వస్తుందని... గ్లోబర్ లీడర్ గా భారత్ ఎదిగేందుకు ఇదెంతో తోడ్పడుతుందని అన్నారు. దేశాన్ని అభివృద్ది పథంలో నడిపించే సత్తా మోదీకి వుంది కాబట్టే మూడోసారి ప్రధాని అయ్యారన్నారు. వికసిత్ భారత్ నినాదంలో పాలన సాగించడమే నరేంద్ర మోదీ ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుందని అన్నారు. 

భారత దేశాన్ని అభివృద్ది చెందిన దేశాల సరసన చేర్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని... పరిస్థితులు ఇలాగే వుంటే 2047 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని మనోజ్ లడ్వా తెలిపారు. స్వతంత్ర భారతంలో మౌళిక సదుపాయాలను కల్పిస్తూనే  సమ్మిళిత వృద్ది కోసం పాటు పడుతున్న ప్రభుత్వం, ప్రధాని ఇదేనని మనోజ్ కొనియాడారు. వచ్చే ఐదేళ్లలో భారత్ ఎవరూ ఊహించని ఆర్థిక సంస్కరణలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇండియా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని మనోజ్ పేర్కొన్నారు.  

భారతదేశాన్ని ప్రమోట్ చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఇండియా గ్లోబల్ ఫోరం కట్టుబడి వుందని మనోజ్ స్పష్టం చేసారు. ముఖ్యంగా టెక్నాలజీ, హెల్త్ కేర్, విద్యా రంగాల్లో భారత్ సహకారం అందించనున్నట్లు తెలిపారు. త్వరలో లండన్ లో జరగనున్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ సమ్మిట్ లో మోదీ 3.O ప్రభుత్వానికి గల అవకాశాలపై మరింత లోతుగా చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.

జూన్ 24 నుండి 28 వరకు లండన్ వేదికగా జరిగే ఐజిఎఫ్ మీటింగ్ లో ఇటీవల ముగిసిన ఎన్నికలు, ఫలితాలతో పాటు భారత్ వ్యాపార అవకాశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇందులొ 2000 మంది పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ అంతర్జాతీయ స్ధాయిలో ఇండియా గురించి జరుగుతున్న వాటిలో అతిపెద్దదిగా ఇండియా గ్లోబల్ ఫోరమ్ ఛైర్మన్ మనోజ్ లద్వా పేర్కొన్నారు. 
 
 


 

click me!