Live: అట్టహాసంగా ప్రారంభమైన మోదీ ప్రమాణ స్వీకారోత్సవం

By Galam Venkata Rao  |  First Published Jun 9, 2024, 7:28 PM IST

Live: ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. 


దేశ రాజధాని ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలతో పాటు రాజకీయ, సినీ దిగ్గజాలు హాజరయ్యారు. మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. మోదీతో ప్రమాణం చేయించారు. మోదీతో పాటు పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తున్నారు.

 

Latest Videos

తెలుగు రాష్ట్రాలకు ఐదు కేంద్ర కేబినెట్‌ పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు (శ్రీకాకుళం), పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), భూపతిరాజు శ్రీనివాస వర్మ (నర్సాపురం), తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డి (సికింద్రాబాద్‌), బండి సంజయ్‌ కుమార్‌ (కరీంనగర్‌) కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

 

click me!