Make in India: విదేశీ హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలు ర‌ద్దు !

By Mahesh RajamoniFirst Published Jan 15, 2022, 3:45 PM IST
Highlights

Make in India: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. "మేక్ ఇన్ ఇండియా" తయారీకి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసింది.
 

Make in India: కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. "మేక్ ఇన్ ఇండియా" తయారీకి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వశాఖలు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెలికాప్టర్, క్షిపణి దిగుమతి (Missiles import) ఒప్పందాలను రద్దు చేసింది. క్షిపణుల దిగుమతుల పై భారత్ – విదేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న ఒప్పందాలపై శుక్రవారం ప్రధాని న‌రేంద్ర మోడీ ఆధ్వర్యంలో రక్షణశాఖ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్ర‌మంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. 'మేక్ ఇన్ ఇండియా'   (Make in India) త‌యారీకి మ‌రింత ఊతం ఇచ్చేందుకు అనుగుణంగా స్వల్ప-శ్రేణి ఉపరితలం నుండి గగనతలం నుండి ప్రయోగించే క్షిపణులు, 14 హెలికాప్టర్ల దిగుమతికి సంబంధించిన టెండర్లను ఉపసంహరించుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం నిర్ణయించింది. విదేశీ విక్రేతల నుంచి పూర్తిగా కొనుగోలు చేసిన 'బై గ్లోబల్' కేటగిరీ కిందకు వచ్చే దిగుమతి ఒప్పందాలను కేంద్రం సమీక్షించిన నేప‌థ్యంలోనే నిర్ణ‌యం తీసుకుంది. దీన్ని బ‌ట్టి చూస్తూ.. ఆత్మనిర్భర్ భారత్ (Atmanirbhar Bharat) చొరవను ప్రోత్సహించే  ప్రయత్నంలో, రక్షణ మంత్రిత్వ శాఖ అనేక ఒప్పందాలను రద్దు చేసుకోవ‌డంతో పాటు భారతీయ ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల త‌యారీ  డెవలపర్‌లకు అనుకూలంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ద‌ని తెలుస్తోంది. 

ఇదిలావుండ‌గా, విదేశీ క్షిపణుల దిగుమతి తదితర ఒప్పందాలపై గత ఏడాది కూడా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ (prime minister narendra modi) అధ్య‌క్ష‌త‌న ఒక సమీక్షాసమావేశం జ‌రిగింది. ఆ సమయంలో త్రివిధ దళాధిపతి, దివంగత జనరల్ బిపిన్ రావత్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ స‌మ‌యంలోనే దీనికి ప్ర‌స్తుతం ఒప్పందాల ర‌ద్దుకు అంశాలు చ‌ర్చకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. ఈ సమావేశంలో భార‌త్ లో రక్షణ పరికరాల తయారీని చేపట్టి, ఇక్కడి నుంచే విదేశాలకు ఎగుమతి చేసేందుకే.. ఈ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.  స్వల్ప-శ్రేణి ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణుల (Missiles import) ఒప్పందాలు మరియు భారత తీర రక్షణ దళానికి చెందిన 14 హెలికాప్టర్ల కొనుగోలుకు టెండర్లను రద్దుతో పాటు మ‌రిన్ని టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం ముందుకు సాగుతున్న‌ద‌ని స‌మాచారం. ఈ జాబితాలో జనరల్ పర్పస్ మెషిన్ గన్స్ కొనుగోలు ఒప్పందాలు, రష్యాతో కుదుర్చుకున్న బహుళ-బిలియన్ డాలర్ల Kamov-226 హెలికాప్టర్ ఒప్పందం, అలాగే Kamov-31 షిప్‌బోర్న్ ఛాపర్స్, Klub క్లాస్ యాంటీ షిప్ క్షిపణులు ఒప్పందాల‌ను సైతం ర‌ద్దు చేసుకోవ‌డానికి ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. 

దేశంలో రక్షణ రంగ ఉత్పత్తు త‌యారీని  బలోపేతం చేయడం, ఈ రంగంలోని ఉత్ప‌త్తుల‌ను విదేశాలకు ఎగుమతిని ప్రోత్స‌హిస్తూ.. ఆయాన సంస్థ‌ల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం నేప‌థ్యంలో కేంద్ర ఈ నిర్ణ‌యం తీసుకుంది.  ఆత్మనిర్భర్ భారత్ వైపు దేశం దృఢంగా పయనించేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భావించిన ప్రధాని మోడీ(prime minister narendra modi).. స్వ‌యంగా మేకిన్ ఇండియా కార్య‌క్ర‌మాల‌ను స‌మీక్షిస్తున్నారు. మేకిన్ ఇండియా (Make in India) కోసం మున్ముందు మ‌రిన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప‌లుమార్లు తెలిపారు. 
 

click me!