Parliament Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 బిల్లులు.. అవేంటంటే..?

Published : Jul 14, 2023, 06:41 AM IST
Parliament Monsoon Session: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 21 బిల్లులు..  అవేంటంటే..?

సారాంశం

Parliament Monsoon Session: ఢిల్లీ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌, డిజిటల్ డేటా రక్షణతో సహా 21 బిల్లులను పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

Parliament Monsoon Session: కేంద్ర ప్రభుత్వం గురువారం  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 21 బిల్లులను జాబితా విడుదల చేసింది. వీటిలో వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, అటవీ సంరక్షణ చట్టాన్ని సవరించే బిల్లు మరియు ఢిల్లీ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌ బిల్లు ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి.  

లోక్‌సభ సెక్రటేరియట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో సినిమా పైరసీని నిరోధించే ముసాయిదా బిల్లు, సెన్సార్ సర్టిఫికేషన్ యొక్క వయస్సు ఆధారిత వర్గీకరణ , నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుతో సహా 21 బిల్లులను వర్షాకాల సమావేశానికి జాబితా చేసింది. సెషన్‌లో ఆమోదం కోసం జాబితా చేయబడిన బిల్లులలో జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు ,మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు ఉన్నాయి. 
 
అలాగే ఢిల్లీ ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లును సమర్పించనున్నారు.  ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) ఆర్డినెన్స్, 2023 కూడా వర్షాకాల సెషన్‌లో ప్రవేశపెట్టబడుతుంది. దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని గ్రూప్-ఎ అధికారుల బదిలీలు, వారిపై క్రమశిక్షణా చర్యల కోసం నేషనల్ క్యాపిటల్ పబ్లిక్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మే 19న ఆర్డినెన్స్ జారీ చేసింది.

ఆప్ నిరసన  

సుప్రీం కోర్టు పోలీసు, శాంతిభద్రతలు, భూమి మినహా అన్ని ఇతర సేవల నియంత్రణను ఢిల్లీ ప్రభుత్వానికి అప్పగించింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. దీని కోసం ఆ పార్టీ అనేక ప్రతిపక్ష పార్టీల మద్దతును కూడా కోరింది. 

పబ్లిక్ ట్రస్ట్ బిల్లు 

జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు 2023కి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇందులో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో 42 చట్టాల్లోని 183 నిబంధనలను సవరించడం ద్వారా చిన్నపాటి అక్రమాలను నేరాల వర్గం నుంచి తొలగించాలని ప్రతిపాదించారు. ఈ మంత్రిత్వ శాఖలలో ఆర్థిక, ఆర్థిక సేవలు, వ్యవసాయం, వాణిజ్యం, పర్యావరణం, రోడ్డు రవాణా, హైవేలు, పోస్ట్‌లు, ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్నాయి. బిల్లులో చిన్న నేరాలను నేరరహితం చేయాలనే ప్రతిపాదనతో పాటు, విశ్వాస ఆధారిత పాలనను ప్రోత్సహించడానికి, నేర తీవ్రత ఆధారంగా ద్రవ్య శిక్షను హేతుబద్ధీకరించాలని కూడా ప్రతిపాదించబడింది.

వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు  

మరో ముఖ్యమైన బిల్లు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) బిల్లు 2023 కూడా వర్షాకాల సెషన్‌లో ఆమోదించబడుతుంది. నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై రూ.250 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది. దేశంలోని పౌరుల వ్యక్తిగత వివరాలను రక్షించే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ఈ బిల్లు పరిధిలోకి మొత్తం వ్యక్తిగత డేటా తీసుకురాబడుతుంది. దీని ప్రకారం..వినియోగదారు వ్యక్తిగత డేటా అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఉపయోగించబడదు.

అటవీ సంరక్షణ చట్టానికి సవరణ బిల్లు

అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా అటవీ (సంరక్షణ) చట్టం 1980ని సవరించాలని ప్రతిపాదించారు. దీని కింద, జాతీయ ప్రాముఖ్యత కలిగిన వ్యూహాత్మక మరియు భద్రత సంబంధిత ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా కొన్ని వర్గాలకు చెందిన భూమిని చట్టం పరిధి నుండి మినహాయించాలని కూడా ప్రతిపాదించబడింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం