అర్థరాత్రి క్యాబ్‌లో ఒంటరిగా అమ్మాయి.. బొమ్మ తుపాకితో బెదిరించి

Siva Kodati |  
Published : Jul 27, 2019, 06:04 PM IST
అర్థరాత్రి క్యాబ్‌లో ఒంటరిగా అమ్మాయి.. బొమ్మ తుపాకితో బెదిరించి

సారాంశం

అర్ధరాత్రి కావడం, యువతి ఒంటరిగా ఉండటంతో క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. 

బొమ్మ తుపాకీతో ఓ మోడల్‌ను బెదిరించి ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడగా.. ఆమె సమయస్ఫూర్తితో తప్పించుకుంది. వివరాల్లోకి వెళితే... జైపూర్‌కు చెందిన ఓ యువతి స్నేహితురాలి ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళ్లేందుకు ఓ క్యాబ్ ఎక్కింది.

అర్ధరాత్రి కావడం, యువతి ఒంటరిగా ఉండటంతో క్యాబ్ డ్రైవర్, అతని స్నేహితుడు బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. అయితే ధైర్యంగా వ్యవహరించిన ఆ యువతి నిందితుడిని కొరికి తప్పించుకుంది.

అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలు తన మొబైల్ కారులో వదిలేసినట్లు తెలియడంతో... పోలీసులు ఆ నెంబర్‌కు కాల్ చేయడంతో నిందితుల్లో ఒకరు ఫోన్ లిఫ్ట్ చేశారు.

సాంకేతికత ఆధారంగా నిందితులు సచిన్ శర్మ, క్యాబ్ డ్రైవర్ సురేశ్ కుమార్ వర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు కొరకడంతో సచిన్ శర్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Fact Check: ప్రధాని మోదీ రాజీనామా చేశారా.? వైరల్ లేఖపై కేంద్రం క్లారిటీ.. అసలు నిజం ఇదే
Vande Mataram Bill: వందేమాతరం పాడేప్పుడు ఈ తప్పులు చేస్తే.. జైలుకు వెళ్లాల్సిందే.