
రాజస్థాన్ : జోధ్ పూర్ కు చెందిన మోడల్ suicide Attemptకి పాల్పడిన సంఘటనలో రాజస్థాన్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులిద్దరూ ఉదయపూర్ కు చెందినవారు. కాగా, వారిలో ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. వారి పేర్లు దీనాలి, అక్షయ్ గా పోలీసులు తెలిపారు. కాగా Jodhpur కు చెందిన Fashion model గున్ గున్ ఉపాధ్యాయ్ రతనాద ప్రాంతంలోని లార్డ్స్ ఇన్ హోటల్లో శనివారం రాత్రి ఆత్మహత్య యత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటనపై బాధితురాలు, ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల సమాచారం ప్రకారం.. Gun Gun Upadhyayను ఉపయోగించి భిల్వారా మంత్రిని హనీ ట్రాప్ కు గురి చేసేందుకు ప్లాన్ చేసినట్లు తేలింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంలోని భిల్వారా కు చెందిన మంత్రి నిందితుల ఫైళ్లను క్లియర్ చేసేందుకు నిరాకరించారు.
దీంతో ఆయనను Honeytrap చేసి బ్లాక్మెయిల్ చేయాలని నిందితులు ప్లాన్ చేశారు. దీనికోసం గున్ గున్ ను వాడుకోవాలని చూశారని డిసిపి bhuvan భూషణ్ తెలిపారు. ప్లాన్ ప్రకారం మోడలింగ్ అసైన్మెంట్ ఉందంటూ నిందితులుగున్ గున్ ను పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ షోలో అవకాశం ఉన్నట్లు నమ్మించి బాధితురాలిని భిల్వారా తీసుకెళ్లారు.
అక్కడికి వెళ్ళాక మంత్రితో గడపాలని నిందితులు ఆమెను బలవంతం చేశారు. దీంతో నిరాకరించి వారి నుంచి తప్పించుకుని జోద్పూర్ చేరుకుంది. అక్కడ లార్డ్స్ సీన్ హోటల్ లో దిగి తండ్రికి ఫోన్ చేసి జరిగినదంతా వివరించి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తండ్రికి చెప్పింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అతడి సమాచారంతో పోలీసులు వెంటనే హోటల్ కు చేరుకున్నారు. అయితే అప్పటికే గున్ గున్ హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిందని డిసిపి మీడియాకు తెలిపారు. ఆ తర్వాత పోలీసులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మోడల్ కాళ్లు, ఛాతీ భాగం ప్రాక్చర్ అయినట్లు వైద్యులు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జనవరి 30న Rajasthanలోని జోధ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఓ హోటల్ టెర్రస్‌పై నుంచి దూకి ఓ woman ఆత్మహత్యాయత్నం చేసింది. జోధ్‌పూర్ నగరంలో నివసించే గుంగున్ ఉపాధ్యాయ్ అనే మహిళ Fashion model. పనిమీద ఉదయపూర్ వెళ్లిన ఆమె శనివారం జోధ్‌పూర్‌కు తిరిగి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమె జోధ్‌పూర్‌లోని రతనాడ ప్రాంతంలోని హోటల్ లార్డ్స్ ఇన్ ఆరో అంతస్తు పై నుంచి దూకి Suicide attempt చేసింది.
టెర్రస్‌పై నుంచి దూకడానికి ముందు గుంగున్ తన తండ్రికి phone చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పినట్లు సమాచారం. తనని చూడడానికి వచ్చినప్పుడైనా తన మొహం చూడాలని తండ్రిని కోరినట్టుగా సమాచారం. కూతురు ఫోన్ అందుకున్న వెంటనే గున్‌గన్ తండ్రి గణేష్ ఉపాధ్యాయ్ పోలీసులకు సమాచారం అందించాడు. వారు హుటాహుటిన హోటల్ కు చేరుకున్నారు. అయితే పోలీసులు వచ్చేలోపే గుంగున్ హోటల్ ఆరో అంతస్తు నుంచి దూకేసింది.
ఇది గమనించిన పోలీసులు... వెంటనే గుంగున్‌ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గుంగున్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరు అంతస్తులమీదినుంచి పడడంతో ఆమె కాళ్లు, ఛాతీ ప్రాంతాల్లో తీవ్రంగా ఫ్రాక్చర్ అయింది. తీవ్ర రక్త స్రావం అయ్యింది. దీంతో వైద్యులు రక్తాన్ని ఎక్కిస్తున్నారు.
అయితే గుంగున్ ఇలాంటి పని చేయడానికి పూనుకోకవడం వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు. గుంగున్ ప్రస్తుతం మాట్లాడే పరిస్థితుల్లో లేదు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాతే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.