కరోనా వ్యాక్సిన్ వల్లే నా కుమార్తె చనిపోయింది... రూ.1000 కోట్లు చెల్లించాలి..

By SumaBala BukkaFirst Published Feb 3, 2022, 8:17 AM IST
Highlights

‘నా కుమార్తె స్నేహాల్… నాసిక్ లో వైద్య విద్యార్థిని. వాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా..  ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఆమె గతేడాది కోవిషీల్డ్ టీకా డోసు తీసుకుంది. కరోనా సురక్షితమని, ఎలాంటి హాని ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్ తీసుకుంది. ఆమె ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది.

ముంబయి : కరోనా టీకా దుష్ప్రభావాల కారణంగానే తన కుమార్తె చనిపోయిందని పేర్కొంటూ Maharashtra ఔరంగాబాద్ కు చెందిన ఓ వ్యక్తి 
Bombay High Courtను ఆశ్రయించాడు. భారీ పరిహారాన్ని కోరాడు. మహారాష్ట్ర ప్రభుత్వం, Serum companyలను రూ.1000కోట్లు compensation చెల్లించేలా ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరాడు. వైద్య విద్యార్థిని ఆయన తన కూతురు గత ఏడాది జనవరిలో వ్యాక్సిన్ తీసుకుందని, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయిందని వివరించాడు.

‘నా కుమార్తె స్నేహాల్… నాసిక్ లో వైద్య విద్యార్థిని. వాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా..  ఆరోగ్య కార్యకర్తలంతా టీకా తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఆమె గతేడాది కోవిషీల్డ్ టీకా డోసు తీసుకుంది. కరోనా సురక్షితమని, ఎలాంటి హాని ఉండదని చెప్పారు. అది నమ్మి వైద్య కళాశాలలో నా కూతురు వ్యాక్సిన్ తీసుకుంది. ఆమె ఆరోగ్య కార్యకర్తగా కూడా సేవలందించింది.

టీకా సురక్షితమని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI), ఎయిమ్స్ డైరెక్టర్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తప్పుడు ప్రచారం చేయడం వల్లే నా కూతురు లాంటి Health workers ఎంతోమంది వ్యాక్సిన్ తీసుకున్నారు’ అని ఆయన పేర్కొన్నారు. తన కూతురు 2021 జనవరి 28న  వ్యాక్సిన్ తీసుకుందని, ఆ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మార్చి 1న మరణించిందని లునావత్ పిటిషన్లో పేర్కొన్నారు. 

Covishield టీకా దుష్ప్రభావాల కారణంగానే తన కుమార్తె మృతి చెందిందని.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన AEFI కమిటీ గతేడాది అక్టోబర్ 2న వెల్లడించినట్లు తెలిపారు. తన కుమార్తెకు న్యాయం కావాలని, అలాగే ఆమె లాంటి ఎంతోమంది ప్రాణాలు కాపాడేందుకు ఈ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు యువతి తండ్రి తన పిటిషన్లో వివరించారు. దీన్ని గతవారమే దాఖలు చేయగా..  హైకోర్టు విచారణకు ఇంకా తేదీని ఖరారు చేయలేదు. 

ఇదిలా ఉండగా, అత్యధిక వేగంతో వ్యాప్తి చెందే Omicron Variant కారణంగా మన దేశంలో కరోనా కేసులుమరోసారి భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గత నెలలో పీక్‌కు వెళ్లి మళ్లీ క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తున్నది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నా.. ఈ మహమ్మారి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం కరోనా వివరాలపై బులెటిన్ విడుదల చేసింది. 

దీని ప్రకారం, గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,61,386 కరోనా కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. రికవరీలూ అంతకు మించే ఉన్నాయి. 24 గంటల్లో 2,81,109 మంది కొవిడ్ నుంచి కోలుకున్నట్టు తెలిపింది. కాగా, 1,733 మంది కరోనా పేషెంట్లు మరణించినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16,21,603 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. అత్యధిక కేసులు నమోదు చేస్తున్న టాప్ స్టేట్స్‌లలో కేరళ(51,887 కేసులు), తమిళనాడు(16,096 కేసులు), మహారాష్ట్ర(14,372 కేసులు), కర్ణాటక(14,366 కేసులు), గుజరాత్(8,338 కేసులు)లు ఉన్నాయి.

బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, తాజాగా చోటుచేసుకున్న 1,733 మరణాలతో దేశంలో మొత్తం మరణాలు ఐదు లక్షలకు చేరువయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 4,97,975కి పెరిగాయి. 1,61,386 రికవరీలతో మొత్తం రికవరీల సంఖ్య 3,95.11,307కి చేరాయి. దీంతో కరోనా పాజిటివిటీ రేటు 11.6 శాతం నుంచి 9.26 శాతానికి పడిపోయింది. కాగా, వారపు పాజిటివిటీ రేటు 14.15 శాతంగా ఉన్నది. 

click me!