ఫ్లెక్సీ పెట్టొద్దన్నందుకు : మహిళను కొడుతూ.. పక్కకు నెట్టేస్తూ, థాక్రే పార్టీ నేత దారుణం ... వీడియో వైరల్

Siva Kodati |  
Published : Sep 01, 2022, 05:14 PM IST
ఫ్లెక్సీ పెట్టొద్దన్నందుకు : మహిళను కొడుతూ.. పక్కకు నెట్టేస్తూ, థాక్రే పార్టీ నేత దారుణం ...  వీడియో వైరల్

సారాంశం

పార్టీ ఫ్లెక్సీలు పెట్టొద్దని ప్రశ్నించినందుకు ఓ మహిళపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత ఒకరు దాడికి దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే సోదరుడు రాజ్ థాక్రేకి చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ వివాదంలో చిక్కుకుకుంది. ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు మహిళను నెట్టడం, చెప్పుతో కొట్టడానికి యత్నించినట్లుగా వున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాష్ దేవి అనే మహిళ ఆగస్ట్ 28న వినోద్ అర్గిలే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కార్యకర్తలు రోడ్డుపై వెదురు స్తంభాలను ఏర్పాటు చేసి వాటిపై పార్టీ ప్రచార బోర్డులను పెట్టడంపై అభ్యంతరం తెలిపింది. అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన వినోద్ సదరు మహిళపై దాడికి దిగడంతో పాటు ఆమెను పక్కకు నెట్టివేశాడు. సదరు వీడియో కొంతమంది స్థానికులు ఆయనను దూరంగా లాగేందుకు ప్రయత్నించినప్పటికీ.. అతను మాత్రం దాడి చేయడం, నెట్టడం మాత్రం ఆపలేదు. దీంతో ప్రకాష్ రోడ్డుపై పడిపోయింది. కానీ ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. 

ALso REad:రాజ్ థాక్రేకు ఏక్ నాథ్ షిండే ఫోన్.. మహారాజకీయాల్లో కొత్త ట్విస్ట్...

ముంబా దేవి ఆలయం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తన మందుల దుకాణం ఎదుట వెదురు స్తంభాలను ఏర్పాటు చేయొవద్దని బాధితురాలు కోరడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అనంతరం దేవి స్పందిస్తూ.. తనపై ఎంఎన్ఎస్ నేతలు భౌతికంగా దాడి చేయడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించారని వాపోయారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. కానీ నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఎంఎన్ఎస్ నాయకత్వం కూడా ఈ ఘటనపై స్పందించలేదు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu