
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో వరుస హత్యల ఘటనలు వెలుగులోకి వచ్చాయి. గడిచిన 72 గంటల్లో వేరు వేరు ఘటనల్లో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురయ్యారు. దీంతో నగరంలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. ఈ హత్యల క్రమాన్ని పరిశీలిస్తే.. మూడింటిలో రెండు ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమాని స్తున్నారు. ఈ కేసును సీరియల్ కిల్లర్స్ కోణంలో కూడా విచారిస్తున్నారు పోలీసులు.
పోలీసుల వివరాల ప్రకారం.. సాగర్ నగర పాంత్రంలో గత 72 గంటల్లో ఇది మూడు హత్యలు జరిగాయి. జిల్లాలోని మోతీనగర్ ప్రాంతంలో గత రాత్రి(బుధవారం) కూడా ఒక వాచ్‌మెన్ హత్యకు గురైనట్లు సాగర్ ఎస్‌ఎస్‌పీ విక్రమ్‌సింగ్ కుష్వాహా తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. విచారణ పూర్తి అవ్వకముందే ఎలాంటి స్పష్టతకు రాలేమన్నారు. ఈ నేపథ్యంలో హంతకుడి స్కెచ్‌ను పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సేకరించిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా హంతకుడిని త్వరలో పట్టుకునేందుకు పట్టుకుంటామని తెలిపారు.
ఇదిలాఉంటే.. కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తిని ఆగస్టు 28 అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చేతిలో హత్యకు గురయ్యాడు. తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేశారు.
మొదటి హత్య ఘటన కాంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 28-29 మధ్య రాత్రి జరిగింది. ఈ ఘటనలో
సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కళ్యాణ్ లోధి(50) అనే వ్యక్తి హత్యకు గురయ్యారు. అతడిని హత్య చేయడానికి హంతుకుడు..సుత్తిని వాడినట్టు గుర్తించారు. వాట్ మెన్ తలను సుత్తితో పగులగొట్టి అతి కిరాతకంగా చంపేసినట్టు పోలీసులు తెలిపారు.
రెండో హత్య సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 29-30 మధ్య రాత్రి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో
జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డు శంభు నారాయణ్ దూబే (60) హత్యకు గురయ్యాడు. అతని తల రాయితో పగులగొట్టినట్లు పోలీసులు తెలిపారు.
మూడవ సంఘటన ఆగస్టు 30-31 మధ్య రాత్రి సాగర్‌లోని మోతీ నగర్ ప్రాంతంలో ఒక ఇంటికి కాపలాగా ఉన్న వాచ్‌మెన్ మంగళ్ అహిర్వార్‌ను కర్రతో దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుల దర్యాప్తులో పలు ముఖ్యమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదటి హత్యలో వాడిన సుత్తిను రెండో వాడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే.. మూడవ మృతుడి మృతదేహం దగ్గర రెండో మృతుడి మొబైల్ ఫోన్ లభ్యమైందని చెప్పారు. ఈ సీరియల్ కిల్లర్ రాత్రి చీకటిలో వచ్చి సెక్యూరిటీ గార్డును టార్గెట్ చేస్తున్నట్టు భావిస్తున్నారు. ఈ మూడు హత్యలకు ఒకదానికొకటి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
క్యాంట్, సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యలు ఒకేలా ఉన్నాయని, వాటిని ఒకే వ్యక్తి చేసినట్లుగా కనిపిస్తోందని పోలీసు సూపరింటెండెంట్ తరుణ్ నాయక్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలు, సేకరించిన శాస్త్రీయ ఆధారాల ఆధారంగా హంతకుడిని త్వరలో పట్టుకునేందుకు పోలీసులు కృషిచేస్తున్నట్లు తెలిపారు. నిందితుడి గురించి పోలీసులకు కొన్ని ఖచ్చితమైన ఆధారాలు లభించాయని, అతనిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారి తెలిపారు.