మాయావతికి షాక్.. 9మంది ఎమ్మెల్యేలు జంప్..?

By telugu news teamFirst Published Jun 15, 2021, 12:55 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో.. మాయావతి పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు సమాచారం. 

ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షురాలు మాయావతికి ఊహించని షాక్ తగిలింది. బహుజన్ సమాజ్ వాద్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో.. మాయావతి పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు భేటీ అయినట్లు సమాచారం. వారంతా.. సమాజ్ వాద్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా.. వీరి మీటింగ్ ప్రస్తుతం యూపీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా.. ఈ తొమ్మిది మందిని ఇటీవల మాయావతి.. బహిష్కరించడం గమనార్హం.

ఉత్తరప్రదేశ్ లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో.. వీరంతా ఎస్పీ వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశమైంది. కాగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ 19 సీట్లు గెలుచుకుంది. ఉప ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోగా.. ప్రస్తుతం యూపీ అసెంబ్లీలో 18మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా.. వీరిలో నాలుగేళ్లలో 11మంది ఎమ్మెల్యేలను మాయావతి బహిష్కరించడం గమనార్హం. పార్టీ వ్యతిరేక కార్యకాలపాలు పాల్పడుతున్నారని వారిని బహిష్కరించారు.

 

click me!