#మీ టూ ఎఫెక్ట్: మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా

Published : Oct 17, 2018, 04:52 PM ISTUpdated : Oct 17, 2018, 05:21 PM IST
#మీ టూ ఎఫెక్ట్:       మంత్రి పదవికి ఎంజె అక్బర్ రాజీనామా

సారాంశం

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్  బుధవారం నాడు రాజీనామా చేశారు.

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవికి ఎంజె అక్బర్  బుధవారం నాడు రాజీనామా చేశారు.కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఎంజె అక్బర్ పనిచేస్తున్నారు.  # మీటూ ఉద్యమంలో భాగంగా కొందరు మహిళా జర్నలిస్టులు ఎంజె అక్బర్ పై లైంగిక ఆరోపణలు చేశారు.

తమపై  ఎంజె అక్బర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా జర్నలిస్టులు  ఆరోపించారు.  ఈ ఆరోపణలను అక్బర్ తీవ్రంగా ఖండించారు. తనపై ఆరోపణలు చేసిన  మహిళా జర్నలిస్టులపై న్యాయ పోరాటానికి కూడ సిద్దమయ్యాడు. అక్బర్‌పై  17 మంది మహిళలు ఆరోపణలు చేశారు.

ఈ తరుణంలోనే  అక్బర్  బుధవారం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.తనకు విదేశాంగ సహాయ మంత్రి బాధ్యతలు కట్టబెట్టిన  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ,  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు  ఆయన ధన్వవాదాలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కోర్టులో  ఈ విషయాన్ని తేల్చుకొనేందుకు వీలుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు  చెప్పారు. 
 

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే