
న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు కంపెనీ బాస్ తన ఉద్యోగులకు జారీ చేసిన ఆదేశాలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ కొత్త వర్క్ పాలసీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టేలా ఉన్నది. పని చేసే చోట పన్‌కు (సరదాకు) ఆస్కారం లేదని బాస్ పేర్కొన్నాడు. ఏ4 పేపర్ పై ఆదేశాలు ప్రింట్ చేసి మెమో రిలీజ్ చేశాడు. ఈ మెమోను ఫొటో తీసి ఓ ఎంప్లాయీ రెడ్డిట్‌లో పోస్టు చేశాడు. దీనిపై నెటిజన్లు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు.
‘ఉద్యోగులారా అటెన్షన్. వర్క్ అంటే సరదాగా గడపడం కాదు. ఇది మీ జాబ్. ఈ పని కాలంలో పనికి సంబంధం లేని విషయాలను మాట్లాడవద్దు. ఈ వర్కింగ్ అవర్స్‌లోనే ఫ్రెండ్షిప్ కోసం సమయం వృథా చేయవద్దు. మీరు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని వర్క్ పూర్తయిన తర్వాత మాట్లాడుకోండి. ఏ ఉద్యోగి అయినా వర్క్ అవర్‌లో వర్క్‌కు సంబంధం లేని విషయాలను మాట్లాడితే నాకు చెప్పండి’ అంటూ పేర్కొన్నారు. మినియన్ ఫొటోతో ఈ ఆదేశాలు పేర్కొన్నారు.
Also Read: ‘నా జీవితమే వాడు.. ఇంత మోసం చేస్తాడనుకోలేదు’.. చైతన్య మాస్టర్ సూసైడ్ పై తల్లి ఆవేదన..
ఈ పోస్టుపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. వేలల్లో కామెంట్లు వచ్చాయి. ఇలా వర్క్ ప్లేస్‌లో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని చాలా మంది పేర్కొన్నారు. ఉద్యోగులు వారి పనిని ఎంజాయ్ చేసినప్పుడే వర్క్ ప్రాడక్టివిటీ పెరుగుతుందని వివరించారు.
ఒక యూజర్ ఘాటుగా స్పందించాడు. తనకు కూడా గతంలో ఇలాంటి బాస్‌లు ఉండేవారని, వారంతా ఎక్కడో కొట్టుకుపోయారని వివరించాడు. ఇప్పుడు తాను ఒక డిపార్ట్‌మెంట్‌కు ఇంచార్జ్ అని, వర్కర్లు వారి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తే ప్రాడక్టివిటీ అధికంగా ఉంటుందని తెలిపాడు.