ట్రెక్కింగ్ కి వెళ్లిన విద్యార్థులు సురక్షితం..

By ramya neerukondaFirst Published Sep 25, 2018, 12:16 PM IST
Highlights

భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

హిమాచల్ ప్రదేశ్ లో ట్రెక్కింగ్ వెళ్లి అదృశ్యమైన విద్యార్థులంతా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.  వారంతా క్షేమంగా ఉన్నారని కౌశిక్ అనే విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం వెల్లడైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...గత ఐదు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో 45మంది ట్రెక్కింగ్ కి వెళ్లారు.

వారిలో వీరిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(రూర్కీ)కి చెందిన 35 మంది విద్యార్థులు ఉన్నారు. భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. వీరిలో కొందు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు.

విద్యార్థులు మిస్సయ్యారన్న వార్త వినగానే.. వారి తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. అయితే వారంతా క్షేమంగా ఉన్నారని అదే ఐఐటీలో చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి తెలియజేశాడు. కౌశిక్.. తన స్నేహితులతో ట్రెక్కింగ్ కి వెళ్లలేదు. వారి నుంచి తనకు వచ్చిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.దీంతో ట్రెక్కింగ్ కి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

click me!
Last Updated Sep 25, 2018, 12:56 PM IST
click me!