ట్రెక్కింగ్ కి వెళ్లి..45మంది మిస్సింగ్

By ramya neerukondaFirst Published Sep 25, 2018, 11:10 AM IST
Highlights

భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు.

హిమాచల్ ప్రదేశ్ లో ట్రెక్కింగ్ కి వెళ్లిన 45మంది సభ్యుల బృందం మిస్సయ్యింది. గత ఐదు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. కాగా.. కొండ చరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఇలాంటి సమయంలో 45మంది ట్రెక్కింగ్ కి వెళ్లారు.

వారిలో వీరిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(రూర్కీ)కి చెందిన 35 మంది విద్యార్థులు ఉన్నారు. భారీ మంచు తుఫాను కారణంగా వీరంతా నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదు. లాహౌల్, స్పితి జిల్లాలోని సానువుల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు ఈ విషయమై స్పందిస్తూ.. హమ్టా మార్గం గుండా వెళ్లి తిరిగి మనాలి చేరుకోవాలని వారంతా ప్లాన్ చేసుకున్నారని చెప్పారు.

అయితే.. భారీ వర్షాలు, మంచు తుఫాన్ కారణంగా వీరు ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డారు. వీరి ఆచూకీ కోసం అధికారులు రెస్క్యూ సిబ్బందిని ఏర్పాటు చేశారు. విద్యార్థుల కోసం వెతుకుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. 

click me!