కాంగ్రెస్ నేత దారుణ హత్య.. స్నేహితుడిని నరుకుతుంటే పారిపోయిన స్నేహితులు

sivanagaprasad kodati |  
Published : Sep 25, 2018, 11:24 AM IST
కాంగ్రెస్ నేత దారుణ హత్య.. స్నేహితుడిని నరుకుతుంటే పారిపోయిన స్నేహితులు

సారాంశం

జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ యువ నేత దారుణ హత్య కలకలం రేపుతోంది. బెంగళూరు యలహంక అల్లాలసంద్రలో నివాసం ఉంటున్న అరుణ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

ఆదివారం రాత్రి సెకండ్ షో సినిమా చూడటానికి అరుణ్ తన మిత్రులతో కలిసి యశ్వంతపూర్‌కు వెళ్లారు. సినిమా చూసి అర్థరాత్రి దాటిన తర్వాత కారులో స్నేహితులతో కలిసి ఇంటికి బయలుదేరారు. ఇంటి సమీపంలోని  అల్లాసంద్ర గేటు వద్ద కారు దిగుతుండగా.. అక్కడే కాపుగాచిన దుండగులు కత్తులు, మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి అరుణ్‌ని హతమార్చారు.

ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మరణించగా...  ఈ దారుణాన్ని చూసిన అరుణ్ మిత్రులు పారిపోయి... కొద్దిసేపు అనంతరం అక్కడికి చేరుకుని కొనఊపిరితో ఉన్న అరుణ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఈ ఘటన బెంగళూరులో సంచలనం కలిగించింది.. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తిస్తున్నారు. రాజకీయ విభేదాలతోనే హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Banks : ఇండియాలో అతిపెద్ద బ్యాంక్ ఏదో తెలుసా..? ఇన్ని లక్షల కోట్లా..!
Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ