
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్‌ను చంపేయడం కలకలం రేపింది. జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ మార్కెట్‌కు వెళ్లుతుండగా ఉగ్రవాదులు ఆదివారం కాల్పులు జరిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. కశ్మీర్‌లోని పార్టీలు మృతిపట్ల సంతాపం తెలిపాయి. ఈ సందర్భంగా పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
హర్యానా అయినా.. కశ్మీర్ అయినా.. మైనార్టీల హత్యలతో బీజేపీనే లాభపడుతుందని ఆమె అన్నారు. కశ్మీర్ లోయలో మైనార్టీల జీవితాలను కాపాడటంతో బీజేపీ విఫలమైందని చెప్పారు. కశ్మీర్‌లో మైనార్టీలను చూపి లోయ అంతా ప్రశాంతంగా ఉన్నదని చూపించే ప్రయత్నం చేస్తున్నదని, ఫలితంగా బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ పండిట్‌ల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నదని ఆరోపించారు.
‘కొన్ని రోజుల క్రితం రాజస్తాన్‌లో ఇద్దరు ముస్లింలను రైట్ వింగ్ టెర్రరిస్టులు చంపేశారు. ఈ రజోు మీరు ఓ హిందును చంపేశారు. వారికి మీకు తేడా ఏముంది?’ అని ప్రశ్నించారు. ‘దేశంలో ముస్లింలను తప్పుగా చూపించడానికి ఇలాంటి ఘటనలను వినియోగించుకుంటుంది. ఇది కశ్మీరీల బిహేవియర్ కాదు. ఈ చర్యలు అన్నీ కూడా ప్రభుత్వ వైఫల్యాలే’ అని ఆమె తెలిపారు.
Also Read: పుల్వామాలో ఉగ్రవాదుల దుశ్చర్య.. మరో కాశ్మీరీ పండిట్ దారుణ హత్య..
అచన్ పుల్వామాకు చెందిన సంజయ్ శర్మ అనే మైనారిటీకి చెందిన ఒక పౌరుడిపై స్థానిక మార్కెట్‌కు వెళుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంలో బలగాలను మోహరించినట్టుగా చెప్పారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని.. దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు.