సేలంలో మైనర్ బాలికను బంధించి, సామూహిక అత్యాచారం.. ఐదుగురి అరెస్ట్

Published : May 01, 2023, 10:25 AM IST
సేలంలో మైనర్ బాలికను బంధించి,  సామూహిక అత్యాచారం..  ఐదుగురి అరెస్ట్

సారాంశం

సేలంలో ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

సేలం : తమిళనాడులోని సేలం నగరంలోని సూరమంగళం సమీపంలో దారుణ ఘటన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఓ  14 ఏళ్ల బాలికను అపహరించిన ఐదుగురు వ్యక్తులు ఆమె మీద  సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరంతా 20 ఏళ్ళ వయసు వారే అని తేలింది. 

నిందితుల్లో ఒకరైన కె వినీత్ అలియాస్ అజర్ (23) అనే వ్యక్తికి ఆ అమ్మాయి తెలుసునని, కొద్ది రోజుల క్రితం ఆమెను అపహరించి తన సోదరుడు విఘ్నేష్ ఇంటికి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు. అక్కడ ఇద్దరు సోదరులు, వారి స్నేహితులు ఎస్ శ్రీనివాసన్ (23), ఎస్ ఆకాష్ (20), ఎస్ అరుణ్ కుమార్ (28) కలిసి బాలికపై పదేపదే అత్యాచారం చేశారు.

కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి అస్వస్థతకు కారణమేమిటో తేల్చేసిన డాక్టర్లు..

అత్యాచారాన్ని మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన వ్యక్తులు, ఫిర్యాదు చేస్తే వీడియోను బయటపెడతామని బెదిరించి మైనర్ బాలికను ఇంటికి పంపినట్లు పోలీసులు తెలిపారు. బాలిక ఇంటికి చేరుకుని తన తల్లిదండ్రులకు జరిగిన దారుణాన్ని వివరించింది. దీంతో శనివారం సాయంత్రం బాలిక తండ్రి ఐదుగురిపై సూరమంగళం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ప్రధాన నిందితుడు వినీత్ ముస్లిం మహిళను వివాహం చేసుకోవడానికి రెండేళ్ల క్రితం ఇస్లాం మతంలోకి మారినట్లు గుర్తించారు. అతనితో పాటు మిగిలిన నలుగురిని విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. ముఠా సభ్యులు నేరం అంగీకరించినట్లు సేలం నగర పోలీసు కమిషనర్ బి విజయకుమారి విలేకరులకు తెలిపారు. వారి ఒప్పుకోలు స్టేట్‌మెంట్ ఆధారంగా, పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. 

పోక్సో చట్టం, ఐటీ చట్టంతో పాటు ఐపీసీ 359, 362 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీ కింద సేలం సెంట్రల్ జైలులో ఉంచారు.

(లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బాధితురాలి గోప్యతను కాపాడేందుకు బాధితురాలి గుర్తింపును వెల్లడించలేదు)

PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు