
ఓ మైనర్ బాలికపై దాదాపు 13 మంది కామాంధుల కన్నుపడింది. ఒకరి తర్వాత ఒకరు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పూణేలో చోటుచేసుకోగా.. బాలికను పంజాబ్ రాజధాని చండీగఢ్ లో రైల్వే పోలీసులు రక్షించారు. అనంతరం చిన్నారిని సంరక్షణ అధికారులకు అప్పగించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పూణేకు చెందిన బాలిక.. తన స్నేహితుడితో కలిసి చండీగఢ్ కు వెళ్లాలని ప్రయత్నించింది. ముంబయి రైల్వే స్టేషన్ లో తను కలుస్తానని ఆమె స్నేహితుడు చెప్పాడు. దాంతో తల్లిదండ్రులకు చెప్పకుండా బాలిక ముంబయి రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అనంతరం ఎంత వెతికినా ఆమెకు తన స్నేహితుడు కనిపించలేదు.
ఈ క్రమంలో ఓ ఆటో డ్రైవర్.. రైల్వే స్టేషన్ బయట ఆమె స్నేహితుడు ఎదురు చూస్తున్నాడని నమ్మించి.. ఆటోలో తీసుకువెళ్లాడు. అనంతరం బాలికతో మద్యం తాగించాడు. పథకం ప్రకారం బాలికను ఓ ప్రదేశానికి తీసుకువెళ్లి.. దాదాపు 13 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని రైల్వే ఉద్యోగికి అప్పగించి.. ఆటో డ్రైవర్ పరారయ్యాడు.
సదరు ఉద్యోగి కూడా బాలికపై అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. చండీగఢ్ వెళ్లేందుకు ఆమెకు రైలు టికెట్ ఇచ్చి అతను వెళ్లిపోయాడు. చండీగడ్ రైల్వే స్టేషన్ లో ఉన్న బాలిను రైల్వే పోలీసులు చేరదీసి.. చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. బాలికను సురక్షితంగా,, తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.