మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..  భరించలేక..

Published : Jul 27, 2023, 03:24 AM IST
మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..  భరించలేక..

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లో మైనర్ బాలికపై బీజేపీ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మైనర్ బాలిక మృతి చెందింది. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో  వెలుగులోకి వచ్చింది

పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  బీజేపీ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మైనర్ బాలిక మృతి చెందింది. వివరాల్లోకెళ్తే.. కూచ్ బెహార్‌లో 14 ఏళ్ల బాలికపై బీజేపీతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది. ఈ ఘటనతో స్థానికంగా గందరగోళం జరిగింది.

ఈ ఘటనలో ప్రధాన నిందితుడు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన నిందితులు బీజేపీతో సంబంధం కలిగి ఉన్నారని బాధితురాలి మామ పేర్కొన్నారు. దీంతో టీఎంసీ కార్యకర్తలు బుధవారం ఎంజేఎన్‌ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. నిందితులతో అనుబంధం ఉందన్న వాదనలను కొట్టిపారేసిన బీజేపీ, నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన కూడా చేసింది. ఇరువర్గాలు కూడా మృతుడి భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు ప్రయత్నించినా తిరస్కరించారు. నిరసనలు తీవ్రం కావడంతో, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)ని మోహరించాల్సి వచ్చింది. మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబీకులు తీసుకెళ్లారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

అసలేం జరిగిందంటే..  చనిపోయిన బాలిక జూలై 18న తన ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. రెండు రోజుల తర్వాత జూలై 20న ఆమె కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలోని పుండిబారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాలికను గుర్తించారు.  పరిస్థితి విషమించడంతో బాలికను రక్షించి చికిత్స నిమిత్తం కూచ్‌బెహార్‌లోని ఎంజేఎన్‌ ఆస్పత్రికి తరలించారు. ఎనిమిది రోజుల పాటు చికిత్స పొందుతున్న ఆమె బుధవారం ఆసుపత్రిలో మరణించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే