Parliament: పార్లమెంటు భవనంలో అగ్ని ప్రమాదం.. 10 నిమిషాల్లోనే..

By team teluguFirst Published Dec 1, 2021, 11:38 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ (Parliament) భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో పార్లమెంట్ భవనంలోని 59వ నెంబర్ గదిలో మంటలు చెలరేగినట్టుగా (fire breaks out) అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. 

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ (Parliament) భవనంలో స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో పార్లమెంట్ భవనంలోని 59వ నెంబర్ గదిలో మంటలు చెలరేగినట్టుగా (fire breaks out) అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టుగా తెలిపారు. 10 నిమిషాల్లోనే మంటలు అదుపులోకి వచ్చినట్టుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని కూర్చీలు, టెబుల్స్, కంప్యూటర్‌లు, ఫర్నీచర్ కాలిపోయినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఉదయం ఈ ప్రమాదంపై తమకు సమాచారం వచ్చిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా చెప్పారు. ఇక, ఏదైనా అవాంఛనీయ పరిస్థితి ఏర్పడితే దానిని ఎదుర్కొనేందుకు వీలుగా పార్లమెంట్ వెలుపల అగ్నిమాపక యంత్రాన్ని ఎప్పుడు అందుబాటులో ఉంటుందని ఓ అధికారి తెలిపారు.

అయితే పార్లమెంట్ శీతకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. అయితే సమావేశాలు ప్రారంభానికి ముందే ఉదయం పూట ఈ ప్రమాదం జరిగింది. ఇక, నవంబర్ 29 నుంచి ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 23 వరకు సాగనున్నాయి. 

click me!