మైనర్ బాలుడిపై స్నేహితుల లైంగిక దాడి... నెలరోజులపాటు బంధించి..

Published : Mar 16, 2020, 09:55 AM IST
మైనర్ బాలుడిపై స్నేహితుల లైంగిక దాడి... నెలరోజులపాటు బంధించి..

సారాంశం

 ఒక్కసారిగా తమ కుమారుడిలో వచ్చిన మార్పుని బాలుడి తల్లిదండ్రులు గుర్తించారు. ఇదే విషయమై కుమారుడిని ప్రశ్నించగా... పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో.. తల్లిదండ్రులు మరోసారి నిలదీయగా... తనపై జరిగిన లైంగిక దాడిని వివరించాడు. వెంటనే బాలుడిని అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

మైనర్ బాలుడిపై అతని స్నేహితులే లైంగిక దాడికి పాల్పడ్డారు. నెలరోజుల పాటు బంధించి చిత్ర హింసలకు గురిచేశారు. వారు పెట్టిన చిత్రహింసలకు బాలుడు భయపడిపోయాడు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలంటే కూడా వణికి పోయాడు. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకుంది.

Also Read భార్య లేని సమయంలో: కూతురిపై రెండేళ్లుగా తండ్రి పైశాచికం, గర్భం దాల్చిన బాలిక...

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయి కుర్లాలోని నెహ్రూనగర్ కి చెందిన ఓ మైనర్ బాలుడిపై అతని స్నేహితులు నలుగురు లైంగిక దాడికి పాల్పడ్డాడు. దాదాపు నెల రోజులపాటు చిత్ర హింసలకు గురిచేశాడు. దీంతో.. బాలుడు వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. కనీసం ఇంట్లో నుంచి బయటకు అడుగుకూడా పెట్టలేకపోయాడు.

కాగా.. ఒక్కసారిగా తమ కుమారుడిలో వచ్చిన మార్పుని బాలుడి తల్లిదండ్రులు గుర్తించారు. ఇదే విషయమై కుమారుడిని ప్రశ్నించగా... పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో.. తల్లిదండ్రులు మరోసారి నిలదీయగా... తనపై జరిగిన లైంగిక దాడిని వివరించాడు. వెంటనే బాలుడిని అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

అక్కడ అతనికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. కౌన్సిలింగ్‌ సమయంలో బాలుడు తనపై నెల రోజులుగా జరిగిన దాడిని వివరించాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఆ నలుగురిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు.  వారిని డోంగ్రీ రిమాండ్‌ హోమ్‌కు తరలించారు.  

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !